KTR : దేశంలో అతిపెద్ద ఆక్వా హబ్‌కు చర్యలు తీసుకుంటున్నాము : కేటీఆర్

KTR : దేశంలో అతిపెద్ద ఆక్వా హబ్‌కు చర్యలు తీసుకుంటున్నాము : కేటీఆర్
KTR : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి

KTR : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో మంత్రి కేటీఆర్‌ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను సన్మానించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని కేటీఆర్‌ చెప్పారు. రైతు భీమాతో వారి కుటుంబాల్లో భరోసా నింపుతున్నామని, సిరిసిల్లా జిల్లాలో 1524 రైతు కుటుంబాలకు 76 కోట్ల 20 లక్షల భీమా పరిహారం అందజేసినట్లు తెలిపారు. రాజరాజేశ్వరి జలాశయంతో జిల్లా సస్యశ్యామలం అయిందన్నారు. దేశంలోనే అతిపెద్ద అక్వా హబ్‌కు చర్యలు తీసుకుంటున్నామని, మిడ్‌ మానేరులో 367 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ అక్వా హబ్‌లో పేరున్న సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. అక్వా హబ్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు

Tags

Read MoreRead Less
Next Story