KTR: గవర్నర్‌గా నరసింహన్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది రాలేదు- కేటీఆర్

KTR: రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ మరింత పెరుగుతోంది. ప్రభుత్వానికి సమాంతర వ్యవస్థగా రాజ్‌భవన్ మారుతోందనే విమర్శల నేపథ్యంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి కనిపిస్తోంది. దీనికితోడు ఢిల్లీ వెళ్లి ప్రధానిని, హోంమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత గవర్నర్ తమిసై చేసిన వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరింది. తమిళిసై వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కేటీఆర్.. గవర్నర్‌కు అవమానం ఎప్పుడు జరిగింది.. ఎక్కడ జరిగిందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గవర్నర్.. గవర్నర్‌గానే వ్యవహరిస్తే గౌరవిస్తామని స్పష్టం చేశారు.
గవర్నర్ అంటే తమకు గౌరవం ఉందన్నారు మంత్రి కేటీఆర్. మేం ఎక్కడా గవర్నర్‌ను అవమానించలేదని ఆయన స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో మాట్లాడిన మాటలు బాధించాయన్న కేటీఆర్.. గవర్నర్‌గా నరసింహన్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది రాలేదన్నారు. పొలిటికల్ లీడర్‌గా మీరు గవర్నర్ కావొచ్చు కానీ.. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ కావొద్దా? అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com