BRS: కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్ రద్దు: కేటీఆర్

BRS: కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్ రద్దు: కేటీఆర్
ఎకరానికి గంట విద్యుత్ చాలనటం రైతులను అవమానించడమే..

తెలంగాణలో పవర్ వార్ మరింత ముదురుతోంది. అధికార బీఆర్ఎస్.. ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య విద్యుత్ మంటలు భగ్గుమంటున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్.. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. బీఆర్ఎస్‌ శ్రేణులతో మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ రైతు వేదిక వద్ద రైతు సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈనెల 17 నుంచి 10 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ రైతు సమావేశాలు నిర్వహించాలన్నారు. 3 పంటలు బీఆర్ఎస్ నినాదం.. 3 గంటల కరెంట్ కాంగ్రెస్ విధానంతో ముందుకెళ్లాలని సూచించారు. రైతులకు కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పేలా తీర్మానాలు ఉండాలన్నారు. రేవంత్‌ వ్యాఖ్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్న కేటీఆర్.. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్ రద్దు అవుతుందని తెలిపారు. ఎకరానికి గంట విద్యుత్ చాలనటం రైతులను అవమానించడమేనని ఆరోపించారు. 24 గంటల విద్యుత్ వద్దన్న కాంగ్రెస్‌ కుట్రను రైతులకు వివరించాలని సూచించారు. కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా.. కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ కావాలా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story