KTR Taiwan Meet: తెలంగాణలో తైవాన్‌ పెట్టుబడులకు ప్రాధాన్యత: కేటీఆర్

KTR Taiwan Meet: తెలంగాణలో తైవాన్‌ పెట్టుబడులకు ప్రాధాన్యత: కేటీఆర్
X
KTR Taiwan Meet: తెలంగాణలో తైవాన్‌ పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యతనిస్తామన్నారు మంత్రి కేటీఆర్‌.

KTR Taiwan Meet: తెలంగాణలో తైవాన్‌ పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యతనిస్తామన్నారు మంత్రి కేటీఆర్‌ (KTR). ఇన్వెస్ట్‌ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తైవాన్‌- కనెక్ట్‌ తెలంగాణ స్టేట్‌ వర్చువల్‌ సమావేశం(Taiwan connect Telangana Virtual Meeting)లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ-తైవాన్‌ మధ్య అద్భుతమైన భాగస్వామ్యం ఉందని... ఆ దేశ పారిశ్రామిక సంస్కృతి నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు.

ఇండియన్‌ తైవాన్‌ స్టార్టప్‌ అలయన్స్‌ని ఏర్పాటు చేసుకున్న ఏకైక భారత సిటీగా హైదరాబాద్‌ ఉందన్నారు. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధిస్తుందన్నారు. తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజాలను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Tags

Next Story