KTR: కవితపై మాట్లాడేదీ ఏమీ లేదు: కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత సస్పెన్షన్.. తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆయా పార్టీలు ఈ విషయంపై రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత సస్పెన్షన్‌పై ఓ జర్నలిస్ట్ కేటీఆర్‌ను ప్రశ్నించగా.. ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. కవిత సస్పెన్షన్ విషయం పార్టీలో చర్చించి తీసుకుందని స్పష్టం చేశారు. పార్టీకి నష్టం చేకూర్చిన ప్రతి ఒక్కరికీ ఇదే రూల్ వర్తిస్తుందని తెలిపారు. కవితపై చర్చలు తీసుకున్నాక ఇక మాట్లాడేది ఏం లేదని కేటీఆర్ సూటిగా సమాధానం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారపడి గోదావరి జలాల పథకానికి శంకుస్థాపన చేస్తున్నారని చెప్పారు.
వెనక్కి తగ్గే ముచ్చటే లేదు: కవిత
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేస్తోందని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు.తెలంగాణ జాగృతి కార్యాలయంలో 70కి పైగా బీసీ కులాల నాయకులతో ఆమె భేటీ అయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇంత వరకు తెలంగాణ బీసీల రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు పార్లమెంట్లో ప్రస్తావించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించాలన్నారు.
రేవంత్‌రెడ్డికి సిగ్గుందా? : కేటీఆర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోకి మహారాష్ట్ర పోలీసులు వచ్చి నెలల తరబడి కార్మికులలా పని చేసి... రూ.12 వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారన్నారు. 21 నెలల నుంచి ఆ డ్రగ్స్ కంపెనీపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదంటే, రేవంత్ రెడ్డికి ఏమైన ముడుపులు అందాయా? అని ప్రశ్నించారు. హోంమంత్రి శాఖ, ఈగల్ టీం, హైడ్రా టీం ఏం చేస్తోంది? , సీఎంకు సిగ్గుందా? అని క్వశ్చన్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com