KTR: ఛాలెంజ్ విసిరిన కేటీఆర్.. స్వీకరించిన పవన్ కళ్యాణ్..
KTR: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతల మధ్య చేనేత ఛాలెంజ్ నడుస్తోంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ మై హ్యాండ్ లూమ్.. మై ప్రైడ్ పేరుతో ఛాలెంజ్ విసిరారు. చేనేతలతో దిగిన ఫోటోలను ట్వీట్ చేయాలని కోరారు. ఈ ఛాలెంజ్‌ను జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్వీకరించారు. చేనేతల మీద తనకున్న ప్రేమాభిమానాలను చాటుకుంటూ వారితో దిగిన ఫోటోలను పవన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి బాలినేని, బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్‌కు చేనేత ఛాలెంజ్ విసిరారు పవన్‌కల్యాణ్.
భారతీయ సాంస్కృతిక వారసత్వానికి తెలంగాణ చేనేతలు ప్రతీకలని మంత్రి కేటీఆర్ అన్నారు .హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి కేటీఆర్ తన సందేశాన్ని అందించారు .చేనేత బీమా పథకాన్ని మంత్రి కేటీఆర్ ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు .దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన తరుణంలో భారత ప్రభుత్వం చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం దురదృష్టకరమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తరఫున, భారతదేశంలోని చేనేత కార్మికులందరి తరఫున జీఎస్టీని ఎత్తి వేయాలని ఆయన డిమాండ్ చేశారు . ఆగస్ట్ ఏడవ తేదీ నుంచి రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా పథకం అమలులోకి తీసుకువచ్చినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు . నేతన్న బీమా ద్వారా 80వేల కార్మికులకు లబ్ధి చేకూరుతుదన్నారు. ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే ఐదు లక్షల బీమా అందుతుందన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com