KTR Twitter: కార్పెంటర్ పనితనం.. కేటీఆర్ ప్రశంసలు..

KTR Twitter: తూర్పుగోదావరి జిల్లా మండపేటకుచెందిన ఓ కార్పెంటర్ తనప్రతిభతో అందరికి ఆకట్టుకుంటున్నాడు. తీరిక సమయాల్లో చెక్కలను ఉపయోగించి చిన్నపిల్లలు ఆడుకునే ఆటవస్తువులతోపాటు.. అందమైన గృహోపకరణాలను తయారుచేస్తూ అబ్బుర పరుస్తున్నాడు. దీనిలో భాగంగా ఉడెన్ ట్రేడ్ మిల్ తయారు చేశాడు. మండపేట పట్టణంశివారులోని గొల్లపుంత కాలనీకిచెందిన కడియపు శ్రీనివాస్.. ఎలక్ట్రిక్ ట్రేడ్ మిల్ చూసి.. దాన్ని కలపతో రూపొందించాడు.
ఈ వీడియోని తన మిత్రుడికి పంపగా.. అతను దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో అది అలా అలా తెలంగాణ ఐటి శాఖమంత్రి కేటీఆర్ చూసి ఆశ్చర్యపోయాడు. దాన్ని తన ట్విట్టర్‌లో పంచుకున్నాడు. అతన్ని తెలంగాణ వ్యక్తిగా భావించిన కేటీఆర్.. అతని వివరాలు తెలుసుకొని తగిన ప్రోత్సాహం అందించాలని టీ వర్క్స్ అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో కడియపు శ్రీనివాస్ వివరాలు తెలియడంతో.. తక్కువ ఖర్చుతో రూపొందిస్తున్న ఉడెన్ ట్రేడ్ మిల్ తనకు కావాలంటూ చాలా మంది ఫోన్లు చేస్తున్నట్లు అతను తెలిపారు.
Wow! 👏👏 @TWorksHyd please connect & help him scale up https://t.co/FVgeHzsQx8
— KTR (@KTRTRS) March 18, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com