KTR : అందుకు 'ఐకియా' క్షమాపణలు చెప్పాల్సిందే : కేటీఆర్

KTR : అందుకు ఐకియా క్షమాపణలు చెప్పాల్సిందే : కేటీఆర్
KTR : ఐకియా హైదరాబాద్‌ స్టోర్‌ సిబ్బంది కాస్త పద్దతి మార్చుకోవాలంటూ ఘాటుగా ట్వీట్‌ చేశారు మంత్రి కేటీఆర్.

KTR : ఐకియా హైదరాబాద్‌ స్టోర్‌ సిబ్బంది కాస్త పద్దతి మార్చుకోవాలంటూ ఘాటుగా ట్వీట్‌ చేశారు మంత్రి కేటీఆర్. మణిపూర్‌ జంట ఐకియాలో షాపింగ్ చేసి వెళ్తుండగా.. స్టోర్ సిబ్బంది ఆపేశారు. తమపై జాత్యహంకారం ధోరణితో వ్యవహరించారంటూ ఆ దంపతులు ఆరోపించారు. ఐకియా నుంచి మిగతా వాళ్లందరినీ పంపించి, తమను మాత్రమే ఆపడం ఏమిటని ట్వీటర్‌లో ప్రశ్నించారు. పైగా ఐకియా స్టోర్‌ స్టాఫ్‌ మొత్తం రేసిజానికి మద్దతుగా నిలిచారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మండిపడిన మంత్రి కేటీఆర్.. కస్టమర్లతో ఎలా మెలగాలో సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, వీలైనంత త్వరగా పద్దతి మార్చుకుంటారని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story