వరంగల్ లో కేటీఆర్‌ పర్యటన..1456 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

వరంగల్ లో కేటీఆర్‌ పర్యటన..1456 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
ఇవాళ మంత్రి కేటీఆర్‌ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ తూర్పు, పరకాల నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఇవాళ మంత్రి కేటీఆర్‌ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ తూర్పు, పరకాల నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 1456 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. గీసుగొండ మండలంలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ 840 కోట్లతో చేపట్టే వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దక్షిణకొరియా కు చెందిన ఈ కంపెనీ ఏర్పాటు చేసే వస్త్రపరిశ్రమతో ప్రత్యక్షంగా పరోక్షంగా 22 వేల మందికి ఉపాధి లభించనుంది. అనంతరం నర్సంపేట రోడ్డులోని వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేస్తారు. అనంతరం దేశాయిపేట వద్ద 200 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను, వరంగల్‌లో నిర్మాణం పూర్తి చేసుకున్న 16 స్మార్టు రోడ్లను కూడా వరంగల్‌ చౌరస్తా వద్ద ప్రారంభిస్తారు. వరంగల్‌ మోడ్రన్‌ బస్‌స్టేషన్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణ పనులకూ శంకుస్థాపన చేస్తారు. అనంతరం అజంజాహిమిల్స్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభ పాల్గొని ప్రసంగించనున్నారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. నగరాన్ని గులాబీ జెండాలతో ముస్తాబు చేశారు పార్టీ శ్రేణులు. ఇక సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వరంగల్ నర్సంపేట రూట్ లో వాహనాల దారి మళ్ళిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story