KTR: 72 గంటలు టైమ్ ఇస్తున్నాం.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్

తెలంగాణ రాజకీయాలు సవాళ్లు, ప్రతిసవాళ్లతో హీటెక్కుతున్నాయి. అటు సీఎం రేవంత్.. ఇటు కేటీఆర్ సై అంటే సై అంటున్నారు. రైతు సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని రేవంత్ సవాల్ విసరగా.. తాము సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా డేట్, టైమ్ కూడా కేటీఆర్ ఫిక్స్ చేసి చెప్పారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో 8వ తేదీన 11 గంటలకు చర్చ వస్తామని కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు.
తెలంగాణ రూపు రేఖలు మార్చాం
తెలంగాణలో రైతు బంధు విప్లవాత్మక పథకం. రైతు బంధుపై ఆక్స్‌ఫర్డ్‌లో ప్రశంసలు వచ్చాయి. ఎరువులు కూడా ఇవ్వలేని సీఎం మమ్మల్ని విమర్శిస్తారా?. ఇందిరమ్మ రాజ్యంలో చెరువులు ఎండితే మేము కళకళలాడేలా చేశాం. చంద్రబాబు రైతులు గొంతు కోశారు. జల దోపిడీని సీఎం రేవంత్ అడ్డుకోవడం లేదు. దత్తత పేరుతో పాలమూరును దగ చేసింది ఎవరో ప్రజలకు తెలుసు. ఫ్లోరైడ్ మహమ్మరిని తరిమికొట్టింది కేసీఆర్ కాదా?. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే రూ.30వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రూపురేఖలు మార్చాం’ అని చెప్పుకొచ్చారు. రైతుల శ్రేయస్సు కోసం చేపట్టిన పనులపై బహిరంగ చర్చకు రావాలంటూ బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ విసిరారు. ఈ సవాల్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రైతురాజ్యంపై చర్చకు సిద్ధమని ప్రకటించారు.అంతేకాకుండా రేవంత్ సవాల్ నుంచి పారిపోకుండా చర్చకు రావాలని కోరారు. డేట్, టైమ్, ప్లేస్ మీరు చెప్తారా? మమ్మల్ని చెప్పమంటారా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు?
మేమే ఎక్కువ
సీఎం రేవంత్‌తో చర్చకు కేసీఆర్ అవసరం లేదని.. తాము చాలని కేటీఆర్ అన్నారు. నీళ్లు, నియామకాలు, నిధుల కోసం తాము పోరాడితే.. రేవంత్ అధికారంలోకి వచ్చాక నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి, నియామకాలు ఆయన సన్నిహితులకు పోతున్నాయని విమర్శించారు. రైతు సంక్షేమానికి కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. రైతు బంధు అనేది విప్లవాత్మక పథకం అని.. ఆక్స్ఫర్డ్ లో సైతం దానికి ప్రశంసలు వచ్చాయని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర రూపురేఖలే మారిపోయాయన్నారు. కానీ గత 18 నెలలుగా రాష్ట్రంలో టైమ్ పాస్ పాలన నడుస్తుందని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే అందుబాటులో లేని ఎరువులు, విత్తనాలు,.. కాలిపోతున్న మోటర్లు అని అన్నారు. అంతేకాకుండా ఏడాదిన్నరలో 60వేల ఉద్యోగాలు ఇచ్చామన్న రేవంత్ వ్యాఖ్యలను కేటీఆర్ కొట్టిపారేశారు. ఉద్యోగాల భర్తీపై రేవంత్ మాట్లాడటం మిలీనియం జోక్ అని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు.. అపాయింట్ మెంట్ లెటర్స్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేశామనడం సిగ్గుచేటన్నారు. మహారాష్ట్రలో సగటున ప్రతి 3గంటలకు ఒకరైతు ఆత్మహత్య చేసుకోవడం కలచివేస్తోందన్నారు. వ్యవసాయ విధానాన్ని అర్థం చేసుకునే మెరుగైన వ్యవస్థ మనకు కావాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com