ktr: లోకేష్‌ను కలిస్తే తప్పేంటి: కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తన పదవికి అడ్డం వస్తారో అని మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కామెంట్ చేశారు. తమ్ముడిలాంటి లోకేష్‌ను కలవడానికి రాత్రి వెళ్లాల్సిన అవసరం లేదని పట్టపగలే కలుస్తానని అన్నారు. ఖమ్మంలో పర్యటించిన కేటీఆర్ పువ్వాడ అజయ్ నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి తన వాళ్ల కోసం ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నారే తప్ప ప్రజలకు ఎలాంటి పనులు చేయడం లేదని అన్నారు. ఢిల్లీకి మూటలు, తన కుటుంబానికి కాంట్రాక్టులు, చంద్రబాబుకు గోదావరి నీళ్లు, ఇలా తనకు కావాల్సిన ఆరు గ్యారంటీలు మాత్రం అమలు అవుతున్నాయని అన్నారు. తనపై టన్నుల కొద్దీ కేసులు పెట్టారని.. చివరికి గుండు సూదంత ఆధారం చూపలేదని కేటీఆర్అన్నా రు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు. ధైర్యం ఉంటే ఏం ఆధారాలు ఉన్నాయో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక అభివృద్ధి సమస్యలపై మాట్లాడిన కేటీఆర్, ఆ ప్రాంత ప్రజల సంక్షేమం పట్ల తమ పార్టీ కట్టుబాట్లను మళ్లీ వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని బ్రహ్మానందంతో పోల్చారు.
బీఆర్ఎస్ పాలనలో పదేండ్లలో ఏ ఒక్కరోజు కూడా శాంతి భద్రతల సమస్య రాలేదు. ఒక్కనాడు కూడా కర్ఫ్యూ విధించలేదు. రౌడీ షీటర్ల దురాగతాలు లేవు. ప్రశాంతమైన వాతావరణంలో హైదరాబాద్ నగరం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి బాటలో దేశానికి ఆదర్శంగా నిలబడింది. ‘‘దుబాయ్‌లో ఎవరో చనిపోతే నాకేం సంబంధం. దురలవాట్లకు ప్రజలు దూరంగా ఉండాలి. నేను జీవితంలో ఏనాడూ సిగరెట్ కూడా తాగలేదు. సీఎం రేవంత్‌రెడ్డి నాపై ఎన్నో ఆరోపణలు చేశారు. నేను ఏం చేసినా.. బాజాప్త చేస్తా. నేను ఏపీ మంత్రి లోకేశ్‌ను కలవలేదు.. ఒక వేళ కలిసినా తప్పేంటి? నారా లోకేశ్ నాకు మంచి మిత్రుడు.. ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన పక్క రాష్ట్రం మంత్రి.. నాకు తమ్ముడి లాంటి వారు. డైవర్షన్ పాలిటిక్స్ తప్ప.. రేవంత్‌రెడ్డి 20 నెలల్లో చేసింది శూన్యం. అభివృద్ధిని, శాంతి భద్రత పరిరక్షణను హర్షించిన ప్రజలు, 2018, 2023 ఎన్నికల్లో ఏకపక్షమైన విజయాన్ని కేసీఆర్‌కు అందించారు. అలాగే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు సాధించి రికార్డు నమోదు అని కేటీఆర్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com