KTR: అరెస్ట్ చేసుకుంటారా..చేసుకోండి: కేటీఆర్

KTR: అరెస్ట్ చేసుకుంటారా..చేసుకోండి: కేటీఆర్
X
తనకు అరెస్ట్ భయం లేదన్న కేటీఆర్... ఈ కార్ కేసులో నేను ఏ తప్పు చేయలేదు... లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమన్న కేటీఆర్

లగ్జ­రీ కా­ర్ల వి­ష­యం­లో తాను తప్పు చే­స్తే కేం­ద్ర ప్ర­భు­త్వం చర్య­లు తీ­సు­కో­వ­చ్చ­ని మాజీ మం­త్రి కే­టీ­ఆ­ర్ సవా­ల్ వి­సి­రా­రు. ఫా­ర్ము­లా ఈ రే­స్‌ కే­సు­లో తాను ఏ తప్పూ చే­య­లే­ద­ని అన్నా­రు. అవ­స­ర­మై­తే లై డి­టె­క్ట­ర్‌ పరీ­క్ష­కు సి­ద్ధ­మ­ని కీలక ప్ర­క­టన చే­శా­రు. అరె­స్ట్ చే­యా­ల­ను­కుం­టే చే­సు­కోం­డి అని సవా­ల్ చే­శా­రు. లగ్జ­రీ కా­ర్ల కే­సు­లో­నూ వి­చా­ర­ణ­కు సి­ద్ధ­మ­ని కే­టీ­ఆ­ర్‌ ప్ర­క­టిం­చా­రు. తమ హయాం­లో హై­ద­రా­బా­ద్‌ మె­ట్రో­కు మంచి డి­మాం­డ్‌ ఉం­డే­ద­ని, తాము ది­గి­పో­యే నా­టి­కి దే­శం­లో­నే రెం­డో అతి­పె­ద్ద వ్య­వ­స్థ­గా ఉం­ద­ని అన్నా­రు. అధి­కా­రం­లో­కి రా­గా­నే రే­వం­త్‌­రె­డ్డి అనా­లో­చి­తం­గా ఎయి­ర్‌­పో­ర్టు మె­ట్రో­ను రద్దు చే­శా­రు. ఆయన తల­చు­కుం­టే ఇప్ప­టి­కే ఎయి­ర్‌­పో­ర్టు మె­ట్రో పూ­ర్త­య్యే­ది. భూ­సే­క­రణ ఇబ్బం­ది కూడా లేదు. ఎయి­ర్‌­పో­ర్టు మె­ట్రో కొ­న­సా­గిం­చా­ల­ని ఎల్‌ అం­డ్‌ టీ కో­రిం­ది. అం­దు­కు రే­వం­త్‌­రె­డ్డి ఒప్పు­కో­లే­దు. అప్ప­టి నుం­చే సీఎం, ఎల్‌ అం­డ్‌ టీ మధ్య గొడవ మొ­ద­లైం­ది. రే­వం­త్ వై­ఖ­రి వల్లే ఆ సం­స్థ వె­ళ్లి­పో­తోం­ద­ని కే­టీ­ఆ­ర్ వి­మ­ర్శిం­చా­రు. తన అరె­స్టు కోసం కాం­గ్రె­స్ నే­త­లు కళ్లు కా­య­లు కా­సే­లా ఎదు­రు చూ­స్తు­న్నా­ర­ని ఎద్దే­వా చే­శా­రు. తనను అరె­స్టు చే­సు­కోం­డి... తనకు అరె­స్టు భయం లే­ద­ని స్ప­ష్టం చే­శా­రు. తాను ఏ తప్పు చే­య­లే­ద­ని... ఏం చే­సు­కుం­టా­రో చే­సు­కో­వా­ల­ని సవా­ల్ వి­సి­రా­రు. తనతో రే­వం­త్‌­రె­డ్డి లై డి­టె­క్ట­ర్ టె­స్ట్‌­కు రా­వా­ల­ని ఛా­లెం­జ్ చే­శా­రు. తనపై ఏసీ­బీ కేసు ఉం­ద­ని... రే­వం­త్‌­రె­డ్డి­పై కూడా ఏసీ­బీ కే­సుం­ద­ని గు­ర్తు­చే­శా­రు.

ప్రభుత్వానికి మాయని మచ్చ

గత ప్ర­భు­త్వ హయాం­లో హై­ద­రా­బా­ద్‌ మె­ట్రో­కు మంచి డి­మాం­డ్‌ ఉం­డే­ద­ని, తాము ది­గి­పో­యే నా­టి­కి దే­శం­లో­నే రెం­డో అతి­పె­ద్ద వ్య­వ­స్థ­గా ఉం­ద­ని కే­టీ­ఆ­ర్‌ అన్నా­రు. తాము అధి­కా­రం­లో ఉన్న­ప్పు­డే ఎయి­ర్‌­పో­ర్టు మె­ట్రో­కు కూడా శం­కు­స్థా­పన చే­సి­న­ట్లు చె­ప్పా­రు. తె­లం­గాణ భవ­న్‌­లో ని­ర్వ­హిం­చిన మీ­డి­యా సమా­వే­శం­లో ఆయన మా­ట్లా­డు­తూ.. గతం­లో వై­ఎ­స్‌­ఆ­ర్‌ ఓఆ­ర్‌­ఆ­ర్‌ ని­ర్మిం­చి­న­ప్పు­డు ఒక మంచి పని చే­శా­ర­ని, రో­డ్డు పక్కన కొంత భూ­మి­ని అద­నం­గా వది­లా­ర­ని చె­ప్పా­రు. ‘‘అధి­కా­రం­లో­కి రా­గా­నే రే­వం­త్‌­రె­డ్డి అనా­లో­చి­తం­గా ఎయి­ర్‌­పో­ర్టు మె­ట్రో­ను రద్దు చే­శా­రు. ఆయన తల­చు­కుం­టే ఇప్ప­టి­కే ఎయి­ర్‌­పో­ర్టు మె­ట్రో పూ­ర్త­య్యే­ది. భూ­సే­క­రణ ఇబ్బం­ది కూడా లేదు. ఎయి­ర్‌­పో­ర్టు మె­ట్రో కొ­న­సా­గిం­చా­ల­ని ఎల్‌ అం­డ్‌ టీ కో­రిం­ది. అం­దు­కు రే­వం­త్‌­రె­డ్డి ఒప్పు­కో­లే­దు. అప్ప­టి నుం­చే సీఎం, ఎల్‌ అం­డ్‌ టీ మధ్య గొడవ మొ­ద­లైం­ది. రే­వం­త్‌­ వై­ఖ­రి వల్లే ఆ సం­స్థ వె­ళ్లి­పో­తోం­ది. ఎల్‌ అం­డ్‌ టీ ని­ష్క్ర­మణ రా­ష్ట్ర ప్ర­భు­త్వా­ని­కి మా­య­ని మచ్చ. పె­ట్టు­బ­డి­దా­రు­ల­ను సా­క్షా­త్తూ ము­ఖ్య­మం­త్రే బె­ది­రి­స్తు­న్నా­రు. ని­యం­త­లా వ్య­వ­హ­రి­స్తు­న్నా­రు’’ అని కే­టీ­ఆ­ర్‌ వి­మ­ర్శిం­చా­రు.

Tags

Next Story