KTR: విద్యార్థులకు భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థుల అపూర్వ పోరాటాన్ని తక్కువ చేసి చూపించే కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ అన్నారు. విద్యార్థుల పోరాటంపై కాంగ్రెస్ ప్రభుత్వం అపవాదులు వేస్తోందని మండిపడ్డారు. కంచ గచ్చిబౌలి భూములను శాశ్వతంగా కాపాడుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు. యూనివర్శిటీ తరలింపు, ఏకో పార్క్ అంటూ ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటూ మండిపడ్డారు. నిస్వార్థంగా చేసే ఉద్యమాలు ఎప్పుడూ విజయం సాధిస్తాయని అన్నారు. భూముల కోసం పోరాటం చేసిన విద్యార్థులు, పర్యావరణ కార్యకర్తలు, వివిధ రంగాల ప్రముఖులు, మీడియాకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, ప్రజలకు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.
కాంగ్రెస్ సర్కార్‌వి అపవాదులు
విద్యార్థుల పోరాటాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చేసి చూపాలన్న కుట్రతో అనేక అపవాదులు వేస్తోందని కేటీఆర్ అన్నారు. నిస్వార్థమైన విద్యార్థి-ప్రజా పోరాటాలు ఎప్పటికైనా విజయం సాధిస్తాయని చెప్పారు. వందల రకాల జంతుజాలం, వృక్షజాతులతో ఉన్న ప్రాంతాన్ని కాపాడేందుకు, భవిష్యత్ తరాలకు అందించేందుకు వారు చేసి పోరాటానికి దేశవ్యాప్తంగా మద్దతు లభించిందని చెప్పుకొచ్చారు. విద్యార్థులతోపాటు దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు కలిసి రావడం ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దళారి మాదిరిగా ఆర్థిక ప్రయోజనాల కోసం ఆలోచించకుండా, భవిష్యత్ ప్రయోజనాల కోసం కంచ గచ్చిబౌలి వేలాన్ని పూర్తిగా విరమించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నుంచి కాంగ్రెస్ నాయకుడి వరకూ పక్కా కుట్రతో మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.
పోరాడుదాం బీఆర్ఎస్ పిలుపు
ఆదాన్ న్యూస్: బీఆర్ఎస్ పార్టీ తరఫున 400 ఎకరాల పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రకృతికి విఘాతం కలగకుండా, యూనివర్శిటీకి ప్రమాదం రాకుండా బీఆర్ఎస్ పార్టీ.. విద్యార్థులకు అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల స్ఫూర్తిని, విద్యార్థుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని భూములు వేలం వేసే ప్రయత్నాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పటిదాకా ప్రస్తుత పోరాటాన్ని కొనసాగిద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com