KTR: అమిత్ షాకు కేటీఆర్ బహిరంగ లేఖ.. 27 ప్రశ్నలతో..

KTR: అమిత్ షాకు కేటీఆర్ బహిరంగ లేఖ.. 27 ప్రశ్నలతో..
KTR: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తెలంగాణ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు..

KTR: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తెలంగాణ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.. తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందంటూ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. 27 ప్రశ్నలతో అమిత్‌షాకు లేఖరాసిన మంత్రి కేటీఆర్.. తెలంగాణపై బీజేపీ ఎనిమిదేళ్లుగా వివక్ష కొనసాగిస్తోందని.. విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు. ప్రతిసారి వచ్చి స్పీచులు ఇచ్చి వెళ్లిపోవడం కేంద్ర నాయకులకు అలవాటుగా మారిందన్నారు కేటీఆర్‌.

తెలంగాణకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలు బీజేపీ నెరవేర్చలేదని ఫైరయ్యారు.. బీజేపీ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు. కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నది దశాబ్దాల డిమాండ్ అని.. కానీ, కోచ్ ఫ్యాక్టరీలకు డిమాండ్ లేదని కేంద్రం చేతులు దులుపుకుందని కేటీఆర్‌ లేఖలో ఫైరయ్యారు.. ఐఐఎం, ఐసర్,ఏన్‌ఐడీ, ట్రిపుల్‌ఐటీ, గిరిజన వర్సిటీ, నవోదయ విద్యాలయాల్లో ఏ ఒక్కటి కూడా కేటాయించలేదని విమర్శించారు.

తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని మంత్రి కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు. మరోసారి తెలంగాణ గడ్డపై అమిత్‌షా అడుగు పెడుతున్న వేళ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజల సాక్షిగా కేంద్రం దృష్టికి తేవడంతో పాటు వాటి కోసం తెగేదాకా కొట్లాడటం మా బాధ్యత అన్నారు. అందుకే తెలంగాణ సమాజం ముక్తకంఠంతో నినదిస్తున్న అనేక కీలక అంశాలు మీ దృష్టికి తీసుకువస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ బాగుపడితే చూడలేని మీ కక్షపూరిత వైఖరితో న్యాయంగా దక్కిన ఆ హామీని ఎందుకు తుప్పు పట్టించారో చెప్తారా అంటూ లేఖలో నిలదీశారు కేటీఆర్‌. పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తామని 2014 ఎన్నికల సభలో సుష్మా స్వరాజ్‌ హామీ ఇచ్చిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు మంత్రి కేటీఆర్. కానీ, అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లు గడిచినా మీరు ఇచ్చిన హామీనే ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి దక్కాల్సిన నిధులు కాకుండా ప్రత్యేకంగా తెలంగాణకు చేసిన సాయం ఏంటో చెప్పాలని మంత్రి కేటీఆర్‌ నిలదీశారు.

Tags

Read MoreRead Less
Next Story