KTR: ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ.. రియల్ ఎజెండా అదేనంటూ విమర్శ..

KTR: ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ.. రియల్ ఎజెండా అదేనంటూ విమర్శ..
KTR: హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించే జాతీయకార్యవర్గ సమావేశాలతో తెలంగాణాలో రాజకీయాలు వేడెక్కాయి.

KTR: హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించే జాతీయకార్యవర్గ సమావేశాలతో తెలంగాణాలో రాజకీయాలు వేడెక్కాయి. దీంతో బీజేపీ నేతలకు గులాబీనేతలు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా మంత్రికేటీఆర్.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ది వికాసం గురించి మాట్లాడాలంటూ వెల్లడించారు.

డీఎన్‌ఏలో విద్వేషాన్ని, సంకుచిత తత్వం నింపుకున్న ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం అత్యాశే అవుతుందన్నారు. వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి ఎన్నడూ చేరుకోలేని మీపార్టీ సమావేశాల రియల్ ఎజెండా విద్వేషమే అన్నారు. అద్భుతమైన తెలంగాణ గడ్డ నుంచి నూతన ఆలోచనా విధానానికి నాంది పలకుకండి అంటూ బహిరంగ లేఖరాశారు. ఇందులో పలు అంశాలపై కేంద్రాన్ని మంత్రికేటీఆర్ విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story