KTR: మోదీకి కేటీఆర్‌ బహిరంగ లేఖ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో..

KTR: మోదీకి కేటీఆర్‌ బహిరంగ లేఖ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో..
KTR: ప్రధాని మోదీకి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

KTR: ప్రధాని మోదీకి.. మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ.. ఆ ఉద్యోగాలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. ఒక రాష్ట్రంగా తెలంగాణ ఇప్పటికే లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. మరో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను సైతం భర్తీ చేయబోతోందన్నారు. ఇక ప్రైవేటు రంగంలో 16 లక్షల ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించామన్నారు. కేంద్ర ప్రభుత్వం.. ఉద్యోగాలను భర్తీ చేయకపోగా..ఉన్న ఉపాధి ఉద్యోగ అవకాశాలపైనా దెబ్బ కొడుతోందన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా శాశ్వతంగా లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. దేశ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని విమర్శించారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే ఐటీఐఆర్‌ ప్రాజెక్ట్‌ రద్దు చేయడం ద్వారా పెద్ద దెబ్బ కొట్టారంటూ మండిపడ్డారు. ప్రధాని మోదీకి ఉద్యోగాల భర్తీపై పలు ప్రశ్నలు సంధించిన మంత్రి కేటీఆర్‌.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం యువతతో టీఆర్‌ఎస్‌ ఆందోళన నిర్వహిస్తుందన్నారు

Tags

Read MoreRead Less
Next Story