KTR : రాఖీ పౌర్ణమి సందర్భంగా పథకాల లబ్దిదారులతో కేటీఆర్ జూం కాన్ఫరెన్స్..

KTR : రాఖీ పౌర్ణమి సందర్భంగా పథకాల లబ్దిదారులతో కేటీఆర్ జూం కాన్ఫరెన్స్..
KTR : కేసీఆర్‌ హయాంలో పెన్షన్లు పదిరెట్లు పెరిగాయన్నారు మంత్రి కేటీఆర్‌.

KTR : కేసీఆర్‌ హయాంలో పెన్షన్లు పదిరెట్లు పెరిగాయన్నారు మంత్రి కేటీఆర్‌. ఆగస్టు 15 నుంచి మరో 10 లక్షల మంది కొత్తవాళ్లకు పెన్షన్లు ఇవ్వనున్నామని తెలిపారు. రాఖీపౌర్ణమి సందర్భంగా వివిధ పథకాల లబ్ధిదారులతో మంత్రి కేటీఆర్‌ జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఆడబిడ్డ పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కావద్దని కల్యాణలక్ష్మి తీసుకొచ్చామన్నారు. తెలంగాణలో 19 లక్షల మంది తల్లులకు ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోందన్నారు.

కంటి వెలుగు ద్వారా బాధితులకు వైద్యం అందించామని తెలిపారు. తెలంగాణ ప్రజలందరి హెల్త్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. మిషన్‌ భగీరథ వల్ల మంచినీటి సమస్య పూర్తిగా తీరిందని చెప్పుకొచ్చారు. నాలుగు లక్షల మంది మహిళా బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇస్తున్నామని చెప్పారు.

Tags

Next Story