బ్రేకింగ్..కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్‌గౌడ్ నామినేషన్ డిస్‌క్వాలిఫై

గాజులరామారం డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్ నామినేషన్‌ను స్క్రూటినీ అధికారులు తిరస్కరించారు. దీంతో రిటర్నింగ్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ తన అనుచరులతో ఆందోళన చేపట్టారు. కుట్రపూరితంగా డిస్ క్వాలిఫై చేశారని ఆరోపించారు. కనీసం అభ్యర్థి అడ్వకేట్‌ను కూడా అధికారులు అనుమతించ లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు..
అంతకుముందు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా రిటర్నింగ్ ఆఫీసు వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. రోడ్డుపైనే బైఠాయించి.. అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులపై టీఆర్ఎస్ నేతల ఒత్తిళ్లే ఈ డిస్‌క్వాలిఫైకు కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లి.. అధికారులతో వాగ్వాదానికి దిగారు. రిటర్నింగ్ అధికారులు.. టీఆర్‌ఎస్ నేతల కనుసన్నల్లో పని చేయడం దారుణమన్నారు.. ఎందుకు డిస్‌క్వాలిఫై చేస్తున్నారో సరైన కారణం చెప్పడం లేదని రేవంత్ మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com