తెలంగాణ తిరుపతిలో కురుమూర్తి జాతరపై కొనసాగుతున్న ఉత్కంఠ

తెలంగాణ తిరుపతిలో కురుమూర్తి జాతరపై కొనసాగుతున్న ఉత్కంఠ
X

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొలువైన కురుమూర్తి జాతరపై ఉత్కంఠ కొనసాగుతోంది. 45 రోజులపాటు కొనసాగే ఈ జాతరపై కరోనా ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో జాతకు ప్రజలు అధిక సంఖ్యలో రావొద్దని, జాతర మాత్రం యధావిధిగా కొనసాగుతుందని ఆలయ పాలకవర్గాలు చెబుతుండగా.. ప్రతిపక్షాలు మాత్రం జాతరను యధావిధిగా నిర్వహించాలని పట్టుబడుతున్నాయి. దీంతో జాతరకు రావాలా వద్దా అనేసందిగ్దంలో పడ్డారు భక్తులు. అనాదిగా వస్తున్న ఆచారానికి కరోనా బూచి చూపి జాతరను నిర్వహించకుండా జారుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ శివారులో తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి జాతర ప్రతియేటా ఎంతో వైభవంగా జరుగుతుంది. కరోనా నేపథ్యంలో జాతర నిర్వాహనపై ఉత్కంఠనెలకొంది. ఈనెల 16 వతేదీన జాతర ప్రారంభం కానుంది. జాతరలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల మొదలుకొని చివరి వరకు దాదాపు 40 రోజులపాటు కురుమూర్తి దేవాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ జాతరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వాసులతోపాటు కర్ణాటక, మహారాష్ట్రకుచెందిన భక్తులు తరలివస్తుంటారు. కరోనా నేపథ్యంలో అధికారులు జాతరకు ఆంక్షలు విధించడంతో భక్తులుసందిగ్దంలో పడ్డారు.

అధికారులు జాతరకు వచ్చే భక్తులతోపాటు ఆలయప్రాంగణంలో ఉన్న షాపులనిర్వహణపై కూడా ఆంక్షలు విధించారు. 45రోజులపాటు జరిగే జాతరకోసం ఇక్కడ 2వేల 5వందల దుకాణాలు ఏర్పాటవుతాయి. దీనిపై ఆధారపడి వందల మంది జీవనం సాగిస్తున్నారు. ఈ జాతర సమయంలోనే వారు సంవత్సరానికి సరిపడ ఆధాయం పొందుతారు. ఎప్పటిలాగే జాతరకోసం వ్యాపారస్తులు అన్ని ఏర్పాట్లుచేసుకున్నారు. కానీ అధికారులు పిడుగులాంటి వార్త చెప్పడంతో వ్యాపారస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కరోనా కారణంగా కురుమూర్తి జాతరపై ఆంక్షలు విధించడంపల్ల ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎప్పటిలాగే జాతరను నిర్వహించాలని కోరుతున్నాయి. కరోనా సాకుచూపి భక్తులను జాతరకు రావొద్దనడం సరికాదని బీజేపీ,కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. ఇది భక్తుల మనో భావాలను దెబ్బతీయడమేనని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే తుంగభద్ర పుష్కరాలపై మీనవేశాలు లెక్కిస్తున్న రాష్ట్రప్రభుత్వం.. కురుమూర్తి జాతరపై ఆంక్షలువిధించడాన్ని భక్తులు వ్యతిరేకిస్తున్నారు.

Tags

Next Story