గులాబీ గూటికి ఎల్.రమణ.. సాయంత్రం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశం..!

X
By - TV5 Digital Team |8 July 2021 2:00 PM IST
L Ramana to Meet kcr : తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీని వీడనున్నారు. ఆయన గులాబీ కండువా కప్పుకునేందుకు దాదాపు సిద్ధమైపోయారు.
L Ramana to Meet kcr : తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీని వీడనున్నారు. ఆయన గులాబీ కండువా కప్పుకునేందుకు దాదాపు సిద్ధమైపోయారు. ఇవాళ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశం అనంతరం ఆయన ఎప్పుడు TRSలో చేరతారనే దానిపై స్పష్టత వస్తుంది. ఈటెల బీజేపీలో చేరడంతో బీసీ సామాజికవర్గంలో బలమైన నేత అయిన రమణకు టీఆర్‌ఎస్ ఆహ్వానం పలికింది. నిజానికి కొద్ది రోజుల కిందటే ఆయన TRSలో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి. రమణ కూడా కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్టీ మారాలనే ఒత్తిడి అనుచరులు, మద్దతుదార్ల నుంచి ఉన్నా ఇన్నాళ్లూ ఆచితూచి స్పందించిన ఆయన.. చివరికి తెలుగుదేశాన్ని వీడాలానే నిర్ణయించుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com