ఆశాఢమాసం బోనాలకు సిద్దమైన లాల్ దర్వాజా మహంకాళీ ఆలయం

ఆశాఢమాసం బోనాలకు సిద్దమైన లాల్ దర్వాజా మహంకాళీ ఆలయం
X
ఆశాఢమాసం బోనాల ఉత్సవాలకు లాల్ దర్వాజా మహంకాళీ దేవాలయం సిద్దమవుతోంది.

ఆశాఢమాసం బోనాల ఉత్సవాలకు లాల్ దర్వాజా మహంకాళీ దేవాలయం సిద్దమవుతోంది. ఈ నెల 23 తేదీ నుంచి ఆగస్ట్ రెండో తేదీ వరకు ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. లాల్ దర్వాజా బోనాల చరిత్ర ఎంతో ఘనమైనదని.. అందుకు తగిన విధంగానే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ వెంకటేశం తెలిపారు .అమ్మవారికి 15 రోజుల పాటు బోనాలు సమర్పిస్తున్నామని..ఢిల్లీలో సైతం కొద్దిమందితో బోనాలు నిర్వహిస్తున్నామన్నారు .దేశంలోని 14 శక్తి పీఠాలు ఉన్నాయని ..ఆ శక్తి పీఠాలకు ఒక్కో ఏడాది ఒక అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తామన్నారు .ఈ ఏడాది శ్రీశైల బ్రమరాంబిక అమ్మవారికి బోనం సమర్పిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు .

Tags

Next Story