TG : ఫిబ్రవరి 15 నుంచి 28లోపు అమల్లోకి భూ భారతి చట్టం: మంత్రి పొంగులేటి

TG : ఫిబ్రవరి 15 నుంచి 28లోపు అమల్లోకి భూ భారతి చట్టం: మంత్రి పొంగులేటి
X

భూ భారతి చట్టం కోసం చాలా కష్టపడ్డామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 15 నుంచి 28వ తేదీ లోపు ఈ చట్టం పూర్తిగా అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా దీనిని అమలు చేస్తామని చెప్పారు. ధరణి ద్వారా ఆక్రమించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని, ధరణిని వాడుకుని తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

రాష్ట్రంలో జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని చెప్పారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, నియోజకవర్గానికి 3,500 చొప్పున కేటాయిస్తామని వివరించారు. ఈ నెల నుంచే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

Tags

Next Story