LASTRIGHTS: నేడు ప్రజా కవి అందెశ్రీ అంత్యక్రియలు

LASTRIGHTS: నేడు ప్రజా కవి అందెశ్రీ అంత్యక్రియలు
X
అందని లోకాలకు అందెశ్రీ.. ప్రముఖుల సంతాపం

రచ­యిత అం­దె­శ్రీ పా­ర్థి­వ­దే­హా­న్ని గాం­ధీ ఆసు­ప­త్రి నుం­చి లా­లా­పే­ట­లో­ని ఆయన ని­వా­సా­ని­కి తర­లిం­చి కా­సే­పు ఉం­చా­రు. తరు­వాత ప్ర­జల సం­ద­ర్శ­నా­ర్థం జయ­శం­క­ర్ స్టే­డి­యా­ని­కి తర­లిం­చా­రు. నేడు ఘట్‌­కే­స­ర్‌­లో అం­త్య­క్రి­య­లు అధి­కా­రిక లాం­ఛ­నా­ల­తో ని­ర్వ­హిం­చ­ను­న్నా­రు. దీ­ని­పై సీఎం రే­వం­త్‌­రె­డ్డి అధి­కా­రు­ల­కు ఇప్ప­టి­కే ఆదే­శా­లు జారీ చే­యగా ఏర్పా­ట్లు జరు­గు­తు­న్నా­యి.

ప్ర­జా కవి అం­దె­శ్రీ ఆక­స్మిక మృతి పట్ల పలు­వు­రు ప్ర­ము­ఖు­లు తీ­వ్ర సం­తా­పం తె­లి­పా­రు. అం­దె­శ్రీ మర­ణం­పై తీ­వ్ర ది­గ్భ్రాం­తి వ్య­క్తం చే­సిన తె­లం­గాణ సీఎం రే­వం­త్‌­రె­డ్డి... రా­ష్ట్ర గీతం ‘జయ జయహే తె­లం­గాణ’ రా­సిన అం­దె­శ్రీ మరణం తె­లం­గాణ సా­హి­తీ లో­కా­ని­కి తీ­ర­ని లో­ట­ని పే­ర్కొ­న్నా­రు. ప్ర­త్యేక రా­ష్ట్ర ఉద్య­మం­లో జయ జయహే తె­లం­గాణ గేయం కో­ట్లా­ది ప్ర­జల గొం­తు­కై ని­లి­చిం­ద­న్నా­రు. అం­దె­శ్రీ­తో తన­కు­న్న అను­బం­ధా­న్ని ఈ సం­ద­ర్భం­గా సీఎం గు­ర్తు­చే­సు­కు­న్నా­రు. ప్ర­జా ప్ర­భు­త్వం అధి­కా­రం­లో­కి వచ్చిన తర్వాత రా­ష్ట్ర గీతం కొ­త్త స్వ­రా­ల­తో రూ­ప­క­ల్పన చే­సు­కు­న్నా­మ­న్నా­రు. తె­లం­గాణ సా­హి­తీ శి­ఖ­రం నే­ల­కూ­లిం­దం­టూ సీఎం సం­తా­పం వ్య­క్తం చే­శా­రు. అం­దె­శ్రీ మృతి పట్ల మాజీ సీఎం కే­సీ­ఆ­ర్ ది­గ్భ్రాం­తి వ్య­క్తం చే­శా­రు. కు­టుంబ సభ్యు­ల­కు ప్ర­గాఢ సా­ను­భూ­తి తె­లి­పా­రు. అం­దె­శ్రీ­తో ఉన్న అను­బం­ధా­న్ని గు­ర్తు­చే­సు­కు­న్నా­రు. అం­దె­శ్రీ మరణం తె­లం­గాణ సా­హి­తీ లో­కా­ని­కి తీ­ర­ని­లో­ట­ని రే­వం­త్ పే­ర్కొ­న్నా­రు.

చంద్రబాబు దిగ్భ్రాంతి

ప్ర­ముఖ కవి, రచ­యిత అం­దె­శ్రీ మృతి పట్ల ఏపీ సీఎం చం­ద్ర­బా­బు, మం­త్రి నారా లో­కే­శ్ ది­గ్బ్రాం­తి వ్య­క్తం చే­శా­రు. " తె­లం­గా­ణ­కు రా­ష్ట్ర గీ­తా­న్ని అం­దిం­చిన డా­క్ట­ర్ అం­దె­శ్రీ మరణ వా­ర్త ది­గ్భ్రాం­తి కలి­గిం­చిం­ది. తె­లు­గు సా­హి­తీ లో­కా­ని­కి ఇది తీ­ర­ని లోటు. ఆయన ఆత్మ­కు శాం­తి చే­కూ­రా­ల­ని ప్రా­ర్ధి­స్తూ... అం­దె­శ్రీ కు­టుంబ సభ్యు­ల­కు నా ప్ర­గాఢ సా­ను­భూ­తి­ని తె­లి­య­జే­స్తు­న్నా­ను" అని ట్వీ­ట్ చే­శా­రు. కవి అం­దె­శ్రీ మృతి పట్ల డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్ తీ­వ్ర వి­చా­రం వ్య­క్తం చే­శా­రు. 'అం­దె­శ్రీ హఠా­న్మ­ర­ణం ది­గ్భ్రాం­తి కలి­గిం­చిం­ది. ఆయన ఆత్మ­కు శాం­తి చే­కూ­రా­ల­ని భగ­వం­తు­ణ్ణి ప్రా­ర్థి­స్తు­న్నా­ను. గొ­ర్రెల కా­ప­రి­గా, కూ­లీ­గా జీ­వి­తం మొ­ద­లు­పె­ట్టి అక్షర యా­త్ర చే­శా­రు. ‘మా­య­మై­పో­తు­న్న­డ­మ్మా మని­ష­న్న­వా­డు... ’ గీతం విం­టే సమా­జా­న్ని అం­దె­శ్రీ ఎం­త­గా చది­వా­రో అర్థ­మ­వు­తుం­ది. అం­దె­శ్రీ కు­టుం­బా­ని­కి ప్ర­గాఢ సా­ను­భూ­తి తె­లి­య­చే­స్తు­న్నా­ను.' ట్వీ­ట్ చే­శా­రు.

Tags

Next Story