Hyderabad Drugs Mafia: డ్రగ్స్ దందాకు కేరాఫ్ అడ్రస్ భాగ్యనగరం..

Hyderabad Drugs Mafia: హైదరాబాద్‌లో మత్తు దందా రెచ్చిపోతూనే ఉంది. పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా... ఎక్కడో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. ఇప్పుడు న్యూఇయర్ సీజన్ కావడంతో డ్రగ్స్ దందా మరింత జోరందుకుంది.
తాజాగా 8 కిలోల ఎఫిడ్రిన్‌ను సీజ్ చేశారు మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ పోలీసులు. చెన్నైకి చెందిన మహమ్మద్, రసూలుద్దీన్ అనే ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు డ్రగ్స్ ముఠా భారీగా ప్లాన్ చేసినట్లు గుర్తించారు.
పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా డ్రగ్స్ మాఫియా.. చాపకింద నీరులా వ్యవహిస్తోంది. నగరాన్ని డ్రగ్స్ దందాకు కేరాఫ్‌గా మార్చుకుంటోంది. పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్ సరఫరా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం దీనికి నిదర్శనం. మల్కాజ్‌గిరిలో పట్టుబడ్డ డ్రగ్స్ విలువ సుమారు 10 కోట్లు ఉంటుందని అంచనా.
కొన్ని రోజుల క్రితం కూడా నగరంలో ఇలాంటి ఓ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఇంటర్‌నేషనల్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మరో గ్యాంగ్ పట్టుబడింది. వరుస డ్రగ్స్ ముఠా అరెస్టులతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. న్యూఇయర్ వేడుకలపైనా ప్రత్యేక నిఘా పెట్టారు.
ఇంటర్‌నేషనల్, ఇంటర్ స్టేట్ రెండు డ్రగ్స్ కేసులను నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇంటర్‌నేషనల్ డ్రగ్స్ కేసులో ఒక నైజీరియన్, సాయి కృష్ణ అనే మరో వ్యక్తిని పట్టుకున్నట్లు తెలిపారు. విరి వద్ద నుంచి 30 గ్రాముల మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నైజీరియన్‌కి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించారు. 2017లో పూణెలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి... ఏడాది పాటు జైల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటు ఎల్‌బీ నగర్ ఎస్‌ఓటీ టీం మరో డ్రగ్స్ రాకెట్‌ను పట్టుకుంది. ఐదుగుర్ని అరెస్ట్ చేసి, 35 లక్షల విలువ గల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ ముఠాలో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా గుర్తించారు.
న్యూఇయర్ వేడుకల పేరుతో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిందితులకు పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిగేలా చూస్తాన్నారు సీపీ మహేశ్ భగవత్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com