పెద్దపల్లి జంట హత్యల ఘటన.. సుమోటోగా విచారణ చేపడతామన్న హైకోర్టు

పెద్దపల్లి జంట హత్యల ఘటన.. సుమోటోగా విచారణ చేపడతామన్న హైకోర్టు
X

పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతుల హత్యను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అడ్వకేట్లు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పట్టపగలు దారుణంగా హత్యలు జరిగిన తీరుపై వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. అటు, ఈ కేసును CBIతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు న్యాయవాది హైకోర్టులో కేసు వేశారు.

మరోవైపు, హైకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ కేసుపై సిట్టింగ్ జడ్జితో జ్యూడీషియన్ ఎంక్వైరీ జరగాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల విచారణ తీరుపై తమకు నమ్మకం లేదని, అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని వారు కోరుతున్నారు. న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి హత్యలకు నిరసనగా అడ్వొకేట్లంతా భారీ ర్యాలీ చేపట్టారు.


Tags

Next Story