Telangana Congress: దూకుడు పెంచిన టీ కాంగ్రెస్

టీ కాంగ్రెస్ దూకుడు పెంచింది. చేరికలపై మరోసారి ఫోకస్ పెట్టింది. బీఆర్‌ఎస్, బీజేపీలోని అసంతృప్తులకుగాలం వేస్తోంది. అధికారపార్టీలోని అసమ్మతి నేతలతో హస్తం పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈసారి ఎలగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తోన్న కాంగ్రెస్ అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని చూస్తోంది. బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మలను కాంగ్రెస్ నేతలు పార్టీలోకి ఆహ్వానించారు. ఖమ్మం లేదా పాలేరులో టికెట్ ఇస్తామని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. తుమ్మల పార్టీలో చేరితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని టీ పీసీసీ నేతలు భావిస్తున్నారు.
బీఆర్‌ఎస్ అసంతృప్త ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, రేఖానాయక్ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మైనంపల్లి, రేఖానాయక్‌కు టికెట్లు ఇస్తామని టీ పీసీసీ ముఖ్యనేతలు హామీ ఇచ్చినట్టు సమాచారం. మల్కాజ్‌గిరితో పాటు మెదక్ టికెట్‌ను తన కుమారుడు మైనంపల్లి రోహిత్‌కు ఇవ్వాలని..మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పెద్దలను కోరినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీలో పదిమంది ముఖ్యనేతలు తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఆ పది మందికి టికెట్ల కేటాయింపుపై సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు చెబుతున్నారు. మొత్తానికి అధికార బీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ఎత్తుకుపైఎత్తులు వేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com