ఖమ్మం కాంగ్రెస్‌ లో ముసలం

ఖమ్మం కాంగ్రెస్‌ లో ముసలం

ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో ముసలం బయటపడింది.. ముఖ్య కార్యకర్తల సమావేశంలో రగడ చోటు చేసుకుంది.. అయితే, భద్రాద్రి జిల్లా చండ్రుగొండ జెడ్పీటీసీ వెంకటరెడ్డి కనీసం పట్టించుకోలేదని ఆయన వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. మరో వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. దీంతో గందరగోళం తలెత్తింది.. ఖమ్మం పార్లమెంటరీ ఇన్‌ఛార్జ్‌ కొత్వాల్‌ నగరానికి వచ్చిన సందర్భంగా జిల్లా పార్టీ ఆఫీస్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.. అయితే, భద్రాద్రి జిల్లా చండ్రుగొండ జెడ్పీటీసీ వెంకటరెడ్డి కనీసం పట్టించుకోలేదని ఆయన వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. కాంగ్రెస్‌ నేతల తీరుకు నిరసనగా వెంకటరెడ్డి వర్గీయులు కుర్చీలు విరగ్గొట్టారు.. భద్రాద్రి జిల్లాలో గెలిచిన ఏకైక జెడ్పీటీసీని అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. కావాలనే వెంకటరెడ్డికి కుర్చీ ఇవ్వకుండా ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ నాయకులు అవమానించారని ఆరోపించారు.

Tags

Next Story