తెలంగాణలో త్వరలో శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..!

X
తెలంగాణలో శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర సర్కారు అభిప్రాయం చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. జూన్ 3 వ తేదీతో తెలంగాణలో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసింది. కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం లేదని గతంలో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు పరిస్థితి మరింతగా అదుపులోకి రావడంతో... ఈసీ వైఖరి మార్చుకుంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని.. అయితే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని ఈసీ కోరింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
