ఆవుదూడలను తినడానికి వెళ్లి బోనులో పడిన చిరుత

X
గత కొంతకాలంగా హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్‌లో కలకలం సృష్టిస్తున్న చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. వాలంతరి వద్ద తెల్లవారుజామున 4 గంటలకు బోనులో చిక్కింది. శనివారం తెల్లవారుజామున వాలంతరి రైస్ రిసెర్చ్ సెంటర్ వద్ద ఓ పశువుల కొట్టంలో రెండు ఆవుదూడలను చంపి తిన్నది. దీంతో పోలీసులు, అటవీశాఖ అధికారులు చిరుత కోసం బోన్లు, సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. శనివారం చనిపోయిన రెండు ఆవు దూడలను అందులో ఎరగా వేశారు. దూడల కోసం వచ్చిన చిరుత బోనులో చిక్కింది. చిరుతను అధికారులు నెహ్రు జూ పార్క్‌కు తరలించారు. ఎట్టకేలకు చిరుత చిక్కడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
