చెట్టెక్కిన చిరుత.. పరుగులంకించుకున్న యువకులు

చెట్టెక్కిన చిరుత.. పరుగులంకించుకున్న యువకులు
భయపడిపోయిన యువకులు గ్రామంలోకి పరుగులు తీశారు

చిరుత చెట్టెక్కింది. అది చూసి స్థానికులు పరుగులంకించుకున్నారు. ఆ తర్వాత తేరుకుని గ్రామస్తులంతా ఒక చోట గుంపుగా చేరి అరుపులు,కేకలతో బెదరగొట్టడంతో చిరుత అడవిలోకి పారిపోయింది. ములుగు జిల్లా వాజేడు మండలానికి 2కిలోమీటర్ల దూరంలో ఉన్న కొంగాల గ్రామ పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

ALSO READ : గుట్టల్లో దెయ్యం.. భయపడి చస్తున్న జనం!

సోమవారం ఉదయం ఊరి బయటకు వెళ్లిన కొందరు యువకులకు చెట్టుపై చిరుత కనిపించింది. భయపడిపోయిన యువకులు గ్రామంలోకి పరుగులు తీశారు. తేరుకున్నాక గ్రామస్తులతో కలిసి చెట్టు వద్దకు వచ్చి పెద్ద పెద్ద శబ్దాలు చేయడంతో చిరుత బయపడి అడవిలోకి పారిపోయింది.

ఈ ఘటనతో అటవీప్రాంతాన్ని ఆనుకుని ఉన్న కొంగాల,దూలాపురం గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మళ్లీ ఎప్పుడు అడవిలో నుంచి చిరుత గ్రామాల్లోకి చొరబడి ఎవరిపై దాడి చేస్తుందోనని హడలి చస్తున్నారు.

ఈనేపథ్యంలో..అటవీశాఖ అదికారులు చిరుతను త్వరగా బంధించి తమ ప్రాణాలు కాపాడాలని బాధిత గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.

ALSO READ : ఇంటికి పిలిచి బీకాం విద్యార్థినిపై అత్యాచారం..!





Tags

Read MoreRead Less
Next Story