శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రహరీ గోడ దూకి వెళ్తున్న చిరుత

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో.. చిరుత సంచారం కలకలం రేపింది. గత అర్థరాత్రి చిరుత..శంషాబాద్ - రషీద్‌గూడ రోడ్డులోని ఎయిర్‌పోర్ట్ ప్రహరీ గోడ దూకి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది..పోలీసులతో పాటు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
అటు.. పెద్ద గోల్కండ వద్ద చిరుత రోడ్డు దాటుతుండగా చూసినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శంషాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు వ్యవసాయ క్షేత్రాల వద్ద రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరోపక్క రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు.. చిరుత జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత సంచరిస్తుండటంతో..రషీద్‌గూడ, బహుదూర్‌గూడ, పెద్ద గోల్కొండ ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com