ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. పాముతో వీడియో చేస్తూ..

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. పాముతో వీడియో చేస్తూ..
X
సెల్ ఫోన్లు వచ్చాక సెల్ఫీ వీడియోలు, ఫోటోల పిచ్చి ఎక్కువైంది ప్రజలకి. కొండల అంచున నిలబడి కొందరు, ప్రవహించే నదిలో నిలబడి మరికొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇంకా మరికొందరు పిచ్చి ముదిరి పాము విషమని తెలిసి దానితో సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. తెలంగాణ భాన్సువాడకు చెందిన ఓ వ్యక్తి ఇదే తరహాలో ప్రాణాలు కోల్పోయాడు.

పాముతో చెలగాటం ఆడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. చేతిలో కూడా కాదు నోట్లో పెట్టుకున్నాడు పాముని. వాడి పిచ్చికి దానికి తిక్క పుట్టింది. కాటు వేసి ప్రాణాలు తీసింది. ఈ విషాదకర సంఘటన తెలంగాణ లోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయి పేట గ్రామంలో చోటు చేసుకుంది.

స్థానికంగా నివసించే మోచి శివరాజ్ అనే యువకుడు పాములను పడుతూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో అతడు రెండు అడుగుల పొడవున్న నాగు పామును పట్టుకున్నాడు. దాన్ని తీసుకెళ్లి అటవీ శాఖ అధికారులకు అప్పచెబితే బాగుండేది. దానితో సెల్ఫీ దిగాలని ముచ్చటపడ్డాడు.

విషనాగుని నోట్లో పెట్టుకుని సెల్ఫీ వీడియో కోసం ప్రయత్నించాడు. దాంతో ఆ పాము యువకుడి నోట్లో విషం చిమ్మింది. కొద్దిసేపటికే శివరాజ్ ప్రాణాలు కోల్పోయాడు. నాగు పాము విషం క్షణాల్లో శరీరం అంతా పాకి పోయి వెంటనే మృతి చెందాడు. ఈ సంఘటన స్థానికులను కలచి వేసింది.

Tags

Next Story