విధిరాత: బైక్‌మీద వెళ్తున్న వారిని బలితీసుకున్న పిడుగు

విధిరాత: బైక్‌మీద వెళ్తున్న వారిని బలితీసుకున్న పిడుగు
చిన్న కుమారుడు శ్రేయాన్ అనారోగ్యానికి గురి కావడంతో వైద్యునికి చూపించాలనుకున్నారు.

సాధారణంగా పిడుగులు చెట్ల మీద పడతాయంటారు. కానీ బైక్ మీద వెళుతున్న వారిపై పిడుగు పడి వారి ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన పి.వెంకటేశ్(35), మౌనిక (27) భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు విశ్వతేజ (5), శ్రేయాన్ (18 నెలలు). కారు డ్రైవర్‌గా పని చేస్తున్న వెంకటేశ్ కుటుంబంతో కలిసి నస్సూర్ మండలంలోని సీసీసీలో నివాసం ఉంటున్నాడు.

చిన్న కుమారుడు శ్రేయాన్ అనారోగ్యానికి గురి కావడంతో వైద్యునికి చూపించాలనుకున్నారు. పెద్ద కుమారుడిని అత్తగారింట్లో వదిలి భార్య, కుమారుడు శ్రేయాన్‌ కలిసి బైక్‌పై ఆస్పత్రికి వెళ్ళి వైద్యుడికి చూపించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో వర్షం వస్తున్నా ఎక్కడా అగకుండా అలాగే తడుస్తూ ఇంటికి వెళుతున్నారు. రైల్వే వంతెన వద్దకు చేరుకునే సమయంలో బైకు సమీపంలో భారీ శబ్ధంతో పిడుగు పడడంతో బైక్ మీద ఉన్న ముగ్గురూ పిడుగు ధాటికి ముగ్గురూ చెల్లా చెదురుగా పడిపోయారు.

స్థానికులు వారిని గమనించి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు తల్లీ కుమారులు మరణించినట్లు నిర్ధారించారు. చికిత్స పొందుతున్న వెంకటేశ్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story