Liquor Sales : ఎక్సైజ్‌ శాఖకు కిక్కిచ్చిన దసరా.. ఖజానాకు కొత్త కళ..

Liquor Sales : ఎక్సైజ్‌ శాఖకు కిక్కిచ్చిన దసరా.. ఖజానాకు కొత్త కళ..
Liquor Sales : దసరా పండుగ.. ఎక్సైజ్‌ శాఖకు మంచి కిక్కిచ్చింది. అమ్మకాల్లో రికార్డుల మోత మోగించింది. భారీ అమ్మకాలతో తెలంగాణ సర్కారు ఖజానాకు కొత్త కళ వచ్చేసింది.

Liquor Sales : దసరా పండుగ.. ఎక్సైజ్‌ శాఖకు మంచి కిక్కిచ్చింది. అమ్మకాల్లో రికార్డుల మోత మోగించింది. భారీ అమ్మకాలతో తెలంగాణ సర్కారు ఖజానాకు కొత్త కళ వచ్చేసింది.దసరా పండగ వేళ మందు బాబులు సీసాలకు సీసాలు మద్యం పుచ్చుకోవడంతో ఎప్పుడూ లేనంత ఆదాయం సమకూరింది. తాగినోడికి తాగినంత అందించింది ఎక్సైజ్ శాఖ. ఈ బ్రాండ్ లేదు.. ఆ బ్రాండ్ లేదనకుండా అన్ని బ్రాండ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. జనాలకు అసలైన దసరా మజా చూపించింది. ఇటు మందుబాబులు కూడా అదే రేంజ్‌లో రెస్బాన్స్ ఇచ్చారు.

బోలెడన్నీ మద్యం పెట్టెలను అమ్మేసిన ఎక్కైజ్ శాఖ తన గల్లా పెట్టెను మనీతో నింపేసింది. గడిచిన నాలుగు రోజుల్లోనే తెలంగాణలో 730 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. దసరా పండుగ రాగానే మద్యం షాపులకు మందుబాబులు పోటెత్తడం కామన్.. ఈసారి కూడా అదే ఊపు కనిపించింది. సాధారణ రోజుల్లో రోజుకు రూ.80-90 కోట్ల మద్యం విక్రయాలు సాగుతుంటాయి. కానీ, ఈ నెల 1న తప్పా.. మిగతా మూడు రోజుల్లో రూ.100 కోట్లకుపైగానే విక్రయాలు సాగాయి. 30న ఏకంగా రూ.313 కోట్ల మద్యం, బీరును సరఫరా చేయడం గమనార్హం.

తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు చెందిన మద్యం డిపోలు రాష్ట్రవ్యాప్తంగా 19 ఉన్నాయి. వీటి నుంచి రాష్ట్రంలోని 2,620 మద్యం షాపులు, 1000కి పైగా బార్లు, క్లబ్బులకు మద్యాన్ని సరఫరా చేస్తుంటారు. దసరా పండుగకు ముందుగానే సెప్టెంబరు 30 నుంచే మద్యం వ్యాపారులు పెద్ద మొత్తంలో లిక్కర్‌, బీరు పెట్టెలను దిగుమతి చేసుకున్నారు. నాలుగు రోజుల్లో కార్పొరేషన్‌ రూ.730 కోట్ల విలువైన మద్యం, బీరును వ్యాపారులకు సరఫరా చేసింది.

గత ఏడాది దసరాకు రూ.504 కోట్ల అమ్మకాలు జరిగితే.. ఈసారి అందుకు రెట్టింపు అమ్మకాలు జరిగాయి. హైదరాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి, హన్మకొండ జిల్లాల్లో ఎక్కువ మద్యం అమ్ముడుపోయింది. సాధారణంగా తెలంగాణలో ప్రతి రోజూ రూ.80 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి వైన్ షాప్‌లు, బార్లకు తరలిస్తారు. కానీ 3వ తేదీ నుంచి అంతకు మించి తరలించారు.

మరోవైపు మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఈసారి ఎక్కువ మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. రాజకీయ నేతలు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి విందు ఇచ్చారు. భారీగా మందు పార్టీలు ఏర్పాటు చేయడంతో లిక్కర్ సేల్స్ అమాంతం పెరిగిపోయాయి. మునుగోడులో ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ.. లిక్కర్ సేల్స్ మరింత పెరిగే అవకాశముంది. దీంతో వచ్చే వారం కూడా ఎక్సైజ్ శాఖ పండుగ చేసుకోవడం ఖాయం.

Tags

Read MoreRead Less
Next Story