Liquor Scam: ప్రగతి భవన్‌లో లిక్కర్‌ స్కామ్‌పై చర్చలు.. సీఎంతో కవిత భేటీ

Liquor Scam: ప్రగతి భవన్‌లో లిక్కర్‌ స్కామ్‌పై చర్చలు.. సీఎంతో కవిత భేటీ
X
Liquor Scam: ప్రగతి భవన్‌లో ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌పై హాట్‌హాట్‌గా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Liquor Scam: ప్రగతి భవన్‌లో ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌పై హాట్‌హాట్‌గా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. గంట క్రితం ప్రగతి భవన్‌కు వెళ్లిన కల్వకుంట్ల కవిత.. సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ప్రస్తుతానికి సీబీఐ ఇచ్చిన నోటీసు కేవలం.. వివరణ కోరడానికేనని చెప్పినట్టుగా తెలుస్తోంది.


సీబీఐ అధికారులు 6వ తేదీన వివరణ ఇవ్వడానికి రావాలనడంపై ఎమ్మెల్సీ కవిత.. సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. ఇప్పటికే 6వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలోనే వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సీబీఐకి సమాచారం పంపించారు.


అయితే, ఈ అంశంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకునే ఆలోచనలో సీఎం కేసీఆర్, కవిత ఉన్నట్టు చెబుతున్నారు. ఈసారి వివరణ కోరేందుకే నోటీసులు ఇచ్చినప్పటికీ.. మున్ముందు మళ్లీ నోటీసులు రావొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే న్యాయ సలహాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Tags

Next Story