తెలంగాణ రైతులకి గుడ్ న్యూస్.. ఈ నెల 16 నుంచి..!

తెలంగాణ రైతులకి గుడ్ న్యూస్.. ఈ నెల 16 నుంచి..!
తెలంగాణ రైతులకి ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు శుభవార్తని చెప్పారు. ఈ నెల(ఆగష్టు) 16న రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ డబ్బులను జమ చేస్తామని ప్రకటించారు.

తెలంగాణ రైతులకి ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు శుభవార్తని చెప్పారు. ఈ నెల(ఆగష్టు) 16న రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ డబ్బులను జమ చేస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ పేరుతో రైతులకి మెసేజ్ వస్తుందని తెలిపారు. రూ. 50వేల లోపు రుణం తీసుకున్న ఆరు లక్షల మంది రైతు ఖాతాల్లోకి 2,006 కోట్ల రుణ మాఫీ డబ్బులు జమకానున్నాయి. ఇందుకోసం బ్యాంకర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలనీ ఆదేశించారు. బ్యాంకర్లు రుణమాఫీ మొత్తాన్ని ఏ ఇతర ఖాతా కింద జమ చేయవద్దని, పూర్తిగా రుణా మాఫీ ఖాతాలోనే జమ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా రుణమాఫీ జరిగిన రైతుల అక్కౌంట్లు జీరో చేసి కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని అన్నారు. వ్యవసాయశాఖ తరుపున సీఎం కేసీఆర్ కి, మంత్రి హరీష్ రావుకి ధన్యవాదాలు తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి.

Tags

Read MoreRead Less
Next Story