TG: ముందుగా సర్పంచ్ ఎన్నికలే

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయబావుట ఎగురవేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికలు, పరిషత్ ఎన్నికలు ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి కారణం.. డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి. . 42% BC కోటా విషయంలో కోర్టు స్టే ఉన్నప్పటికీ, పార్టీ వారీగా రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు జరపాలని కూడా చర్చించారు. తదుపరి న్యాయపోరాటం తర్వాత నిర్ణయం తీసుకుంటారు.
ముందు సర్పంచ్ ఎన్నికలే..
తొలుత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని.. ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లకు ఆదేశాలు ఇవ్వాలని ఈ భేటీలో నిర్ణయించారు. అలాగే 50 శాతం రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
పది రోజుల్లో నోటిఫికేషన్
మరో వారం, పది రోజుల్లో ఈ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లనున్నారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో భావించాం.. రాష్ట్రపతి దగ్గర బీసీ రిజర్వేషన్ బిల్లు ఆగిపోయిందని అన్నారు. రాష్ట్రంలో మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టత ఇచ్చారు. పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. మిగిలిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అన్ని కూడా కోర్టు తీర్పు తర్వాత నిర్వహిస్తామని అన్నారు. గిగ్ వర్కర్ల బిల్లుకూ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. పాఠ్య పుస్తకాల్లో అందెశ్రీ గేయాన్ని చేర్చాల్సిన నిర్ణయించినట్లు తెలిపారు.
మరికొన్ని కీలక నిర్ణయాలు
ఈ సమావేశంలో గిగ్ వర్కర్ల బిల్లుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. 50% రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓఆర్ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను బయటికి తరలించాలని గతంలోనే నోటీసులు ఇచ్చాం. ఆ భూములను ‘మల్టీ యూజ్ జోన్లు’గా వినియోగించుకోవాలని నిర్ణయించాం. వాటికి ఎదురుగా ఉన్న రోడ్డు వెడల్పును బట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రుసుం కట్టాలి. ఇందుకోసం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ సాధించుకున్న పదేళ్లలో రాష్ట్రానికి ప్రత్యేక అధికారిక గీతం లేకపోతే.. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నాం. ఆ రుణాన్ని ఉడతాభక్తిగా తీర్చుకోవాలని ఆయన కుమారుడు దత్తసాయికి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం ఇవ్వాలని క్యాబినెట్ తీర్మానించింది. ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ప్రతి పాఠ్యపుస్తకం మొదటి పేజీలో ముద్రించాలని నిర్ణయించాం. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాత్ర గురించి భావితరాలకు తెలియజేసేలా.. రాష్ట్రంలో అందెశ్రీ స్మృతివనం ఏర్పాటుకు నిర్ణయించాం. డిసెంబరు 7 నాటికి ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీలో డిసెంబరు 8, 9 తేదీల్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-2047’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

