TS Lockdown: మరో పది రోజులు లాక్‌డౌన్..

TS Lockdown: మరో పది రోజులు లాక్‌డౌన్..
తెలంగాణలో మరో పది రోజులు లాక్డౌన్ కొనసాగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

TS Lockdown: తెలంగాణలో మరో పది రోజులు లాక్డౌన్ కొనసాగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో నేటితో లాక్డౌన్ గడువు ముగియనుంది.

ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశమై మళ్లీ జూన్ 10 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఓ చిన్న మార్పుని జోడించింది. సడలింపుల సమయాన్ని మూడు గంటలు పెంచింది. ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు ఇస్తుండగా దాన్ని మధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించారు.

Tags

Read MoreRead Less
Next Story