EC: కేసీఆర్‌ ప్రచారంపై 48 గంటల నిషేధం

EC: కేసీఆర్‌ ప్రచారంపై 48 గంటల నిషేధం
నిన్న రాత్రి ఎనిమిది గంటల నుంచి అమలు... 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారన్న కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారంపై..... కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించింది. ఈ రాత్రి ఎనిమిది గంటల నుంచి.... బహిరంగసభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, మీడియా ద్వారా ప్రచారం చేయరాదని ఈసీ స్పష్టం చేసింది. ఏప్రిల్ ఐదున సిరిసిల్లలో జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై సీఈవో ద్వారా జిల్లా ఎన్నికల అధికారి నుంచి నివేదిక తెప్పించుకున్న ఈసీ కేసీఆర్ కు షోకాజు నోటీసు ఇచ్చింది. ఈసీ నోటీసుకు ఏప్రిల్ 23న వివరణ ఇచ్చిన కేసీఆర్... తాను మాట్లాడిన స్థానిక మాండలికాన్ని అధికారులు సరిగా అర్థం చేసుకోలేదని తెలిపారు. కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకొని కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. తన వ్యాఖ్యల ఆంగ్ల అనువాదం కూడా సరికాదని, ట్విస్ట్ చేశారని ఆరోపించారు. కేవలం.. కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్ని మాత్రమే మీడియా సమావేశంలో ప్రస్తావించానని, ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని తన వివరణలో.. కేసీఆర్ తెలిపారు. ఈ వివరణపై సంతృప్తి చెందని ఈసీ గతంలో కూడా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది. అన్ని అంశాలు పరిగణలోకి 48గంటలపాటు నిషేధం విధిస్తూ.... ఉత్తర్వులు జారీ చేసింది.


మండిపడ్డ కేసీఆర్‌

అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతుల ఉసురు పోసుకుంటోందని కేసీఆర్ మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ సాయంత్రం మహబూబాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి కవితకు మద్దతుగా కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనేవారు దిక్కులేక రైతులుతీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని...., ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో గిరిజనులను గౌరవించలేదని బీఆర్ఎస్‌ హయాంలో సేవాలాల్ భవన్ నిర్మించామని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పై.... గిరిజనులు ప్రతాపం చూపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం 48గంటలు తన ప్రచారాన్ని నిషేదించిందన్న కేసీఆర్ , లక్షలాదిగా ఉన్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు 96గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని స్పష్టం చేశారు.

సార్వత్రిక ఎన్నికలు.....బీఆర్‌ఎస్‌కి అత్యంత సవాల్‌గా మారాయి. గతానికి భిన్నంగా పంథాను మార్చిన KCR..బహిరంగ సభలు కాకుండా బస్సుయాత్ర, రోడ్‌షోల ద్వారా... ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు నల్గొండ, భువనగిరి,మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వరంగల్,ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా... రోడ్‌షో, కార్నర్‌మీటింగ్‌లలో కేసీఆర్‌ పాల్గొన్నారు. యాత్ర నిర్వహిస్తూనే ఆయాలోక్‌సభ నియోజకవర్గ ముఖ్యనేతలతో KCR భేటీఅవుతున్నారు.ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో........పరిస్థితి ఎలా ఉంది? నాయకులు ఎలా పనిచేస్తున్నారనే అంశంపై బీఆర్‌ఎస్‌ అధినేత ఆరా తీస్తున్నారు. ఆయాచోట్ల ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అంశాలు...... వ్యక్తులపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రత్యర్థులకు ధీటుగా ఏంచేస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్న అంశంపై నేతలతో KCR చర్చిస్తున్నారు. ఆయాచోట్ల కాంగ్రెస్, భాజపా పరిస్థితి, ప్రజల ఆలోచనా విధానం.........సమస్యల ఆధారంగా ప్రచారం చేయాలని కేసీఆర్ సూచిస్తున్నారు. ఆశించిన మేర క్షేత్రస్థాయిలో పనిచేయని నేతలకు తనదైన శైలిలో చురకలు అంటిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో..... లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వచ్చే ఓట్ల ఆధారంగానే...... తదుపరి భవిష్యత్ ఉంటుందని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో మెజార్టీ వచ్చిన అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌కు భవిష్యత్ బాగా ఉంటుందని నేతల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

Tags

Next Story