పది సంవత్సరాల నుంచి ప్రేమ..యువతి మోసం చేసిందంటూ యువకుడు ఆత్మహత్యాయత్నం

యువతి మోసం చేసిందంటూ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. పిల్లలమర్రి గ్రామానికి చెందిన రాంబాబు అనే యువకుడు, జగన్నాధపురం గ్రామానికి చెందిన యువతి పది సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. అప్పటినుంచి ఇద్దరు భార్యాభర్తలా కలిసే ఉంటున్నారు.
ఈ క్రమంలో యువతికి గురుకులంలో ప్రభుత్వ ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పిందని.. పది నెలల నుంచి తనతో మాట్లాడకుండా వేరుగా ఉంటోందని యువకుడు వాపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రాంబాబు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఆ యువకుడు.. 'నా మరణ కథ.. నా యువరాణి- నా అర్థాంగికి అంకితం' అనే పుస్తకమే రాశాడు. తన చావుకు ఎవరు కారణం కాదని.. యువతిని ఎవరు ఇబ్బంది పెట్టకూడదని పుసక్తంలో రాశాడు. నిన్ను ఉపాధ్యాయురాలిని చేయడానికి పది సంవత్సరాలు కష్టపడ్డానని వాపోయాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com