LPG GAS: సిలిండర్ కోసం ఉరుగులు..పరుగులు..ఎదురుచూపులు

LPG GAS: సిలిండర్ కోసం ఉరుగులు..పరుగులు..ఎదురుచూపులు
X
తె­లం­గాణ­లో­ని పలు ప్రాం­తా­ల్లో వం­ట­గ్యా­స్‌ సి­లిం­డ­ర్ల కొరతతో ఆం­దో­ళ­న­

తె­లం­గాణ రా­ష్ట్రం­లో­ని పలు ప్రాం­తా­ల్లో వం­ట­గ్యా­స్‌ సి­లిం­డ­ర్ల కొరత వి­ని­యో­గ­దా­రు­ల­ను తీ­వ్ర ఆం­దో­ళ­న­కు గు­రి­చే­స్తోం­ది. ఆన్‌­లై­న్‌­లో గ్యా­స్‌ బు­కిం­గ్‌ సరి­గా జర­గ­క­పో­వ­డం, ఇప్ప­టి­కే బు­కిం­గ్‌ చే­సిన వా­రి­కి కూడా సకా­లం­లో సి­లిం­డ­ర్లు అం­ద­క­పో­వ­డం­తో ప్ర­జ­లు ఇబ్బం­దు­లు పడు­తు­న్నా­రు. ఇటీ­వల పశ్చి­మా­సి­యా­లో నె­ల­కొ­న్న ఉద్రి­క్త పరి­స్థి­తుల నే­ప­థ్యం­లో రా­బో­యే రో­జు­ల్లో గ్యా­స్‌ సర­ఫ­రా మరింత దె­బ్బ­తిం­టుం­దే­మో­న­నే భయం­తో చాలా మంది వి­ని­యో­గ­దా­రు­లు ముం­దు­గా­నే సి­లిం­డ­ర్లు పొం­దేం­దు­కు ప్ర­య­త్ని­స్తు­న్నా­రు సం­గా­రె­డ్డి జి­ల్లా­లో­ని రా­జం­పే­ట్ ప్రాం­తం­లో ఈ పరి­స్థి­తి స్ప­ష్టం­గా కని­పిం­చిం­ది. అక్క­డి గ్యా­స్‌ గో­డౌ­న్‌ నుం­చి వి­ని­యో­గ­దా­రు­ల­కు పం­పి­ణీ చే­య­డా­ని­కి ఆటో­లో సి­లిం­డ­ర్లు తీ­సు­కె­ళ్తు­న్న­ట్లు సమా­చా­రం అం­దు­కు­న్న స్థా­ని­కు­లు వెం­ట­నే అక్క­డి­కి చే­రు­కు­న్నా­రు. కొం­ద­రు తమ ఖాళీ సి­లిం­డ­ర్ల­తో­నే ఆటో వె­నుక పరు­గె­త్తు­తూ పం­పి­ణీ కోసం ఎదు­రు­చూ­శా­రు. పరి­స్థి­తి కా­స్త గం­ద­ర­గో­ళం­గా మా­ర­డం­తో సి­బ్బం­ది రహ­దా­రి పక్కన ఆటో­ను ఆపి, ఇప్ప­టి­కే బు­కిం­గ్‌ చే­సిన వారి వి­వ­రా­లు పరి­శీ­లిం­చి సి­లిం­డ­ర్ల­ను అం­ద­జే­శా­రు. అయినప్పటికీ సరఫరా పరిమితంగా ఉండటంతో అందరికీ వెంటనే సిలిండర్లు దొరకకపోవడంతో కొందరు వినియోగదారులు నిరాశకు గురయ్యారు.

ఇదే పరి­స్థి­తి ఆది­లా­బా­ద్ పట్ట­ణం­లో కూడా కని­పిం­చిం­ది. అక్కడ ఒక ప్రై­వే­టు గ్యా­స్‌ ఏజె­న్సీ ఎదుట ఉదయం నుం­చే వి­ని­యో­గ­దా­రు­లు భా­రీ­గా చే­రు­కు­న్నా­రు. చే­తు­ల్లో ఖాళీ సి­లిం­డ­ర్ల­తో వారు ఏజె­న్సీ వద్ద బా­రు­లు తీ­రా­రు. మం­డు­టెం­డ­ను కూడా లె­క్క­చే­య­కుం­డా గంటల తర­బ­డి ని­ల­బ­డి తమ వంతు కోసం వే­చి­చూ­శా­రు. గ్యా­స్‌ సర­ఫ­రా ఆల­స్య­మ­వు­తుం­డ­టం­తో చా­లా­మం­ది తమ వంట అవ­స­రా­లు ఎలా తీ­ర్చు­కో­వా­ల­నే ఆం­దో­ళన వ్య­క్తం చే­శా­రు. గతం­లో బు­కిం­గ్‌ చే­సిన రెం­డు మూడు రో­జు­ల్లో­నే సి­లిం­డ­ర్లు వచ్చే­వ­ని, ఇప్పు­డు మా­త్రం రో­జు­లు గడి­చి­నా సర­ఫ­రా జర­గ­డం లే­ద­ని వా­పో­యా­రు. ఆన్‌­లై­న్‌ బు­కిం­గ్‌ వ్య­వ­స్థ సరి­గా పని­చే­య­క­పో­వ­డం కూడా సమ­స్య­ను మరింత పెం­చిం­ద­ని తె­లి­పా­రు. పరి­స్థి­తి ఇలా కొ­న­సా­గి­తే రా­బో­యే రో­జు­ల్లో వం­ట­గ్యా­స్‌ కోసం మరింత ఇబ్బం­దు­లు ఎదు­ర­య్యే అవ­కా­శ­ముం­ద­ని వి­ని­యో­గ­దా­రు­లు ఆం­దో­ళన వ్య­క్తం చే­స్తు­న్నా­రు.

గ్యాస్‌ కొరతను కావాలనే సృష్టిస్తున్నారు: బీజేపీ

దే­శం­లో గ్యా­స్ కొరత లే­ద­ని భా­జ­పా రా­ష్ట్ర అధ్య­క్షు­డు రా­మ­చం­ద­ర్రా­వు అన్నా­రు. కొం­త­మం­ది కా­వా­ల­నే కొ­ర­త­ను సృ­ష్టి­స్తు­న్నా­ర­ని ఆరో­పిం­చా­రు. “యు­ద్ధం వల్ల అనేక దే­శా­ల్లో గ్యా­స్ ధరలు పె­రి­గా­యి. మన దే­శం­లో మా­త్రం పె­ర­గ­లే­దు. మోదీ ప్ర­భు­త్వం ఈ ధర­ల­ను ని­యం­త్ర­ణ­లో పె­ట్టిం­ది. గతం­లో గ్యా­స్ ధర రూ.1,200 ఉంటే.. మోదీ ప్ర­భు­త్వం రూ.900లకు తగ్గిం­చిం­ది. మూసీ పు­న­రు­జ్జీ­వా­ని­కి రూ.7వేల కో­ట్లు అం­టు­న్నా­రు. మూసీ ప్రా­జె­క్టు­కు భా­జ­పా వ్య­తి­రే­కం కాదు. అయి­తే, 50 మీ­ట­ర్ల బఫర్ జోన్ అనే­ది అవ­స­రం లేదు. గాం­ధీ వి­గ్ర­హం ఏర్పా­టు­కు 100 ఎక­రా­లు కా­వా­లా? గు­జ­రా­త్లో ఎవ­రి­కీ నష్టం లే­కుం­డా సబ­ర్మ­తి ప్రా­జె­క్టు పూ­ర్తి చే­శాం" అని రా­మ­చం­ద­ర్ రావు అన్నా­రు. సి­లిం­డ­ర్ల కొరత వి­ని­యో­గ­దా­రు­ల­ను ఆం­దో­ళ­న­కు గు­రి­చే­స్తోం­ది. ఆన్‌­లై­న్‌­లో గ్యా­స్‌ బు­కిం­గ్‌ సరి­గా జర­గ­క­పో­వ­డం, బు­కిం­గ్‌ చే­సిన వా­రి­కి సి­లిం­డ­ర్లు అం­ద­క­పో­వ­డం­తో ఇబ్బం­దు­లు పడు­తు­న్నా­రు.

Tags

Next Story