Lulu Mall : హైదరాబాద్ లో మరో భారీ షాపింగ్ మాల్

Lulu Mall : హైదరాబాద్ లో మరో భారీ షాపింగ్ మాల్

సెప్టెంబర్ 27న నగరంలో లులూ గ్రూప్ తన మాల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో హైదరాబాద్ మరో షాపింగ్ డెస్టినేషన్‌కు స్వాగతం పలుకనుంది. కూకట్‌పల్లిలో లులు గ్రూప్ లాంఛ్ చేయబోయే ఈ మాల్ భారతదేశంలో తొలి వెంచరేం కాదు. లులు మాల్స్ ఇప్పటికే వివిధ భారతీయ నగరాల్లో స్థాపించింది.

హైదరాబాద్‌లోని లులు మాల్‌లో సౌకర్యాలు

నగరంలోని లులు మాల్ విస్తృతమైన సౌకర్యాలు అందించడానికి సిద్ధంగా ఉంది. దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లను కలిగి ఉన్న స్టోర్‌లతో పాటు, మాల్‌లో సినిమా హాల్, బహుళ వంటకాల ఫుడ్ కోర్ట్ మరెన్నో సౌకర్యాలను కల్పించనుంది. ఐదు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో, హైదరాబాద్‌లోని అతిపెద్ద షాపింగ్ గమ్యస్థానాలలో ఇది ఒకటి. ఈ మాల్ కోసం రూ. 300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అంతకుముందు ఓ ప్రకటనలో పేర్కొంది.

భారతదేశంలోని ఇతర లులు మాల్స్ కింది నగరాల్లో ఉన్నాయి:

  • కొచ్చి, కేరళ
  • తిరువనంతపురం, కేరళ
  • బెంగళూరు, కర్ణాటక
  • లక్నో, ఉత్తరప్రదేశ్
  • కోయంబత్తూరు, తమిళనాడు

భవిష్యత్తులో లులు గ్రూప్ అహ్మదాబాద్, చెన్నైలలో కొత్త షాపింగ్ మాల్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది. తద్వారా స్థానిక జనాభాకు ఉపాధి అవకాశాలను సృష్టించనుంది.

హైదరాబాద్‌లోని ఇతర షాపింగ్ మాల్స్

లులు మాల్ హైదరాబాద్‌లోని అతిపెద్ద షాపింగ్ మాల్స్‌లో ఒకటి అయినప్పటికీ, నగరం ఇప్పటికే అనేక ప్రసిద్ధి చెందిన మాల్స్ ను కలిగి ఉంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రసిద్ధ షాపింగ్ స్పాట్స్:

  • సిటీ సెంటర్ షాపింగ్ మాల్
  • ఇనార్బిట్ మాల్
  • సుజనా మాల్ ఫోరం
  • హైదరాబాద్ సెంట్రల్ మాల్
  • బాబుఖాన్ మాల్
  • FMG మాల్
  • మంజీరా ట్రినిటీ మాల్
  • గల్లెరియా మాల్
  • GVK వన్ మాల్
  • సనాలీ మాల్

హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక షాపింగ్ స్పాట్స్ ఏర్పాటు చేయడంతో, లులు గ్రూప్ ప్రవేశం నగరానికి అధిక పోటీని తెస్తుందని భావిస్తున్నారు.

Next Story