CM Revanth Reddy:Telangana: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ప్రక్షాళనపై సీఎం సమీక్ష

CM Revanth Reddy:Telangana: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌   ప్రక్షాళనపై సీఎం  సమీక్ష
మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించిన రేవంత్ రెడ్డి.

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థంగా నిర్వహిస్తున్నU.P.S.Cతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరు అధ్యయనం చేసి సవివర నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా TSPSC ఛైర్మన్, సభ్యుల నియామకాలు పూర్తి పారదర్శకంగా ఉండేలా విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు.తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి సచివాలయంలో CM రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

శాంతికుమారి, CM కార్యదర్శి శేషాద్రి, DGP రవిగుప్తా, అదనపు DG.. CV ఆనంద్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి, సిట్ స్పెషల్ అధికారి శ్రీనివాస్ తదితరులు సమీక్షకు హాజరయ్యారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటి వరకు చేసిన నియామకాలు, మిగిలిన నియామకాల ప్రస్తుత స్థితి, పరీక్షల నిర్వహణ, సంబంధిత అంశాలపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ను ప్రక్షాళించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దిల్లీలోని UPSCతో పాటు పలు రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాన్ని పంపి అక్కడి నియామకాల ప్రక్రియపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించి సమర్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకతతో చేపట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు... ఛైర్మన్ సహా సభ్యుల నియామకానికి సంబంధించిన అర్హతలు, ఇతర అంశాల గురించి రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా TSPSC ఛైర్మన్, సభ్యుల నియామకాలు పూర్తి పారదర్శకంగా ఉండేలా విధంగా తగు విధివిధానాలను రూపొందించాలని CM ఆదేశించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, కావాల్సిన సిబ్బంది, ఇతర సదుపాయాలను వెంటనే కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షా పత్రాల లీకేజీ అంశానికి సంబంధించిన వివరాలు, కేసు పురోగతిని రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. గ్రూప్ 1, AEE, తదితర పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీపై వివరాలు ఆరా తీశారు. కేసు పురోగతి, ఇప్పటి వరకు జరిగిన విచారణ, తదుపరి కార్యాచరణ సహా అన్ని అంశాల గురించి పోలీసుల ఉన్నతాధికారుల ద్వారా CM సమాచారం తీసుకున్నారు. ఇతర పరీక్షల తేదీలు, నిర్వహణ అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పరిస్థితులకు అనుగుణంగా కమిషన్ తగిన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story