వైభవంగా గోదావరికి మహా హారతి

వైభవంగా గోదావరికి మహా హారతి
దక్షిణ కాశీగా పేరుగాంచిన జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి నదికి, మహా హారతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు

దక్షిణ కాశీగా పేరుగాంచిన జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి నదికి, మహా హారతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మహా హారతి కార్యక్రమంలో, గోదావరి మహా హారతి వ్యవస్థాపక అధ్యక్షడు పాల్సాని మురళీధర్ రావు పాల్గొని, హారతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. గత పదకొండు సంవత్సరాలుగా కార్తీక మాసంలో గోదావరికి మహా హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు మురళీధర్ రావు. గోదావరి నదిని పరిరక్షించుకోవల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు మురళీధర రావు.

Tags

Next Story