Mahabubabad: ప్రిన్సిపల్ తప్పు చేసింది.. విద్యార్థుల తల్లిదండ్రులు పనిష్మెంట్ ఇచ్చారు..

X
Mahabubabad: స్టూడెంట్ టైంకి రాకపోతే బయట నిల్చోబెట్టడం చూశాం. కాని, ప్రిన్సిపల్ సమయానికి స్కూల్‌కు రావడం లేదని స్కూల్‌కే తాళం వేసి బయట నిల్చోబెట్టారు విద్యార్ధుల తల్లిదండ్రులు. మహబూబాబాద్‌లో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సమయపాలన పాటించడం లేదంటూ ఎస్ఎంసీ చైర్మన్, సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు బడికి తాళం వేశారు. దీంతో పాఠశాల ముందు విద్యార్థులు పడిగాపులు పడాల్సి వచ్చింది. పైగా స్కూల్లో టాయిలెట్లు కూడా శుభ్రంగా ఉండవని కంప్లైంట్ చేశారు. చివరికి, పై ఆధికారులు ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో స్కూల్ గేటు తాళాలు తీశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
