రైతు కాళ్లు మొక్కిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే!

ఆసుపత్రి నిర్మాణానికి భూమని దానం చేసిన ఓ రైతు పాదాలను మొక్కి అందరిని ఆశ్చర్యపరిచారు మహబూబాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలోని ఆమన్‌గల్‌లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఆమన్‌గల్‌లో ఆసుపత్రి నిర్మాణానికి వద్ది సుదర్శన్ రెడ్డి అనే ఓ రైతు 24 గుంటల భూమిని విరాళంగా ఇచ్చారు. దీని విలువ సుమారుగా రూ.30 లక్షల పై మాటే.
దీనికి సంబంధించిన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ శంకుస్థాపన చేశారు. అయితే స్థలాన్ని విరాళంగా ఇవ్వడంతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆ రైతుకు కృతజ్ఞతలు తెలుపుతూ పాదాభివందనం చేశారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఆ రైతును అభినందించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com