రూ.కోటితో శివాలయాన్ని తీర్చిదిద్దిన ఎమ్మెల్యే మైనంపల్లి

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు... తన స్వగ్రామం నిజామాబాద్ జిల్లాలోని జన్నెపల్లిలో కోటి రూపాయలతో శివాలయం నిర్మించారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న పురాతన ఆలయాన్ని సొంత ఖర్చులతో ఆధునీకరించారు. మార్చి1న ఎమ్మెల్సీ కవిత చేతుల మీదుగా.. ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. సీసీ కెమెరాలు, టైల్స్‌తో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కీసర శివాలయం, జన్నేపల్లి శివాలయం ఒకేలా ఉన్నాయన్నారు ఎమ్మెల్యే హన్మంత్‌రావు. మార్చి ఒకటిన హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు దాదాపు రెండు వందల కార్లతో ర్యాలీ నిర్వహిస్తామన్నారు.అక్కడనుంచి 3వేల బైక్‌లతో ర్యాలీ చేస్తామన్నారు మైనంపల్లి హన్మంతరావు.
నిజామాబాద్ జిల్లా, నవిపేట్ మండలం, జన్నేపల్లి శివాలయ పునర్నిర్మాణ పనుల్లో స్వయంగా పాల్గొనడం జరిగింది.@KTRTRS @RaoKavitha pic.twitter.com/kOmTq61fgE
— Mynampally Hanumantha Rao (@MynampallyTRS) February 24, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com