Malladi Chandrasekhara Sastry : ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి ఇక లేరు..!
Malladi Chandrasekhara Sastry : ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. హైదరాబాదులోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

Malladi Chandrasekhara Sastry : ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. హైదరాబాదులోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1925 ఆగస్టు 28వ తేదీన మల్లాది దక్షిణామూర్తి దంపతులకు జన్మించారు. చంద్రశేఖరశాస్త్రి సనాతన సత్సంప్రదాయం గల కుటుంబంలో జన్మించారు.
15ఏళ్ల వయసులోనే ప్రవచన యజ్ఞాన్ని ప్రారంభించారాయన. హరికథ, నాటకం, పురాణం కలిపి శ్రోతలను ఆకట్టుకునే విధంగా పురాణ ప్రవచనం చేయడంలో మల్లాది చంద్రశేఖరశాస్త్రి సుప్రసిద్ధులు. చంద్రశేఖరశాస్త్రి వారి సుదీర్ఘ పురాణ ప్రవచన ప్రస్థానంలో ఎందరో ప్రముఖులు, ప్రముఖ సంస్థలతో లెక్కలేనన్ని సన్మానాలు, సత్కారాలు, బిరుదులు పొందారు.
అందులో ప్రముఖంగా తిరుమల తిరుపతి దేవస్థానాలలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యాతగా స్వామివారి కల్యాణాన్ని భక్తుల కన్నుల ముందు సాక్షాత్కరింపచేసి అభినవ వ్యాస బిరుదును పొందారు. ఆలిండియా రేడియో,దూరదర్శన్‌లలో ఎన్నో ప్రవచనాలు ఇచ్చారు. ఈయన తెలుగు, సంస్కృత భాషల్లో మంచి ఘనాపాఠి.
RELATED STORIES
Atal: భారత్ మాజీ ప్రధాని జీవితంపై సినిమా.. ఫస్ట్ లుక్ రిలీజ్..
29 Jun 2022 1:30 PM GMTSamantha: సమంతకు మరో ఐటెం సాంగ్ ఆఫర్.. ఈసారి బాలీవుడ్లో..
28 Jun 2022 4:15 PM GMTPooja Hegde: బాలీవుడ్‌పై పూజా ఫొకస్.. ఎలాగైనా హిట్ కొట్టాలని...
28 Jun 2022 12:15 PM GMTRanbir Kapoor: ఏడేళ్ల తర్వాత కలిసి నటించనున్న మాజీ ప్రేమికులు..
27 Jun 2022 4:15 PM GMTNeetu Kapoor: ఆలియా ప్రెగ్నెన్సీపై రణబీర్ తల్లి నీతూ కపూర్ రియాక్షన్..
27 Jun 2022 1:05 PM GMTRanbir Kapoor: రణభీర్ ఫేవరెట్ హీరోయిన్ ఆలియా కాదట.. మరి ఎవరంటే..?
27 Jun 2022 11:00 AM GMT