MALLAREDDY: కుమార్తె ముఖ్యం కాదు.. పార్టీ ముఖ్యం: మల్లారెడ్డి

MALLAREDDY: కుమార్తె ముఖ్యం కాదు.. పార్టీ ముఖ్యం: మల్లారెడ్డి
X
అధికార-ప్రతిపక్షాల మాటల యుద్ధం

బీ­ఆ­ర్ఎ­స్ నే­త­లు హరీ­శ్ రావు, సం­తో­ష్ రా­వు­ల­పై కవిత చే­సిన వ్యా­ఖ్య­లు సం­చ­ల­నం­గా మా­రా­యి. కవిత వ్యా­ఖ్య­ల­పై మాజీ మం­త్రి మల్లా­రె­డ్డి స్పం­దిం­చా­రు. పా­ర్టీ­ని ధి­క్క­రిం­చిన ఆమె­పై వేటు వే­య­డం సరైన ని­ర్ణ­య­మే­న­ని చె­ప్పా­రు. ‘‘కే­సీ­ఆ­ర్‌­కు కు­మా­ర్తె, కు­మా­రు­డు ము­ఖ్యం కాదు.. ఆయ­న­కు పా­ర్టీ­యే ము­ఖ్యం. దే­శ­వ్యా­ప్తం­గా ఇలాం­టి సస్పె­న్ష­న్లు ప్ర­తి పా­ర్టీ­లో జరి­గా­యి. ప్ర­తి కు­టుం­బం­లో గొ­డ­వ­లు సహజం. తె­లం­గాణ ప్ర­జ­లే కే­సీ­ఆ­ర్‌­కు ము­ఖ్యం. తన కు­మా­ర్తె, కు­మా­రు­డి కోసం పా­ర్టీ­ని ఆయన నా­శ­నం చే­సు­కో­లే­రు. కా­ళే­శ్వ­రం­పై తప్పు­డు ప్ర­చా­రం చే­స్తు­న్నా­రు. ఈ వి­ష­యం­లో సీ­బీఐ మా­త్ర­మే కాదు.. ఎవరూ ఏమీ చే­య­లే­రు. సీ­బీఐ పే­రు­తో కే­సీ­ఆ­ర్‌­ను ఇబ్బం­ది పె­ట్టా­ల­ను­కో­వ­డం సరి­కా­దు. ఆయ­న­లాం­టి గొ­ప్ప వ్య­క్తి తె­లం­గాణ నా­య­కు­డి­గా ఉం­డ­టం మనం­ద­రి అదృ­ష్టం. కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం కా­ళే­శ్వ­రం అం­శం­పై ప్ర­జ­ల­ను తప్పు­దోవ పట్టి­స్తూ డ్రా­మా­లు చే­స్తోం­ది’’ అని మల్లా­రె­డ్డి వి­మ­ర్శిం­చా­రు.

చచ్చినా పామును ఇంకా చంపలేం: టీపీసీసీ చీఫ్

బీ­ఆ­ర్ఎ­స్ నే­త­ల­పై జా­గృ­తి నా­య­కు­రా­లు కల్వ­కుం­ట్ల కవిత చే­సిన ఆరో­ప­ణ­ల­పై టీ­పీ­సీ­సీ చీఫ్ మహే­ష్ కు­మా­ర్ గౌడ్ స్పం­దిం­చా­రు. కవిత కొ­న్ని సత్యా­లు, కొ­న్ని అస­త్యా­లు చె­ప్పా­ర­ని అన్నా­రు. చచ్చిన పా­ము­ను ఇంకా చంపే ఓపిక తమకు లే­ద­ని ఆయన సం­చ­లన ఆరో­ప­ణ­లు చే­శా­రు. రే­వం­త్ రె­డ్డి­పై కవిత చే­సిన వ్యా­ఖ్య­లు అన్ని ఆధార రహి­త­మ­ని... అర్ధ రహి­త­మ­ని మం­డి­ప­డ్డా­రు. హరీ­శ్ రా­వు­తో కాం­గ్రె­స్ కు­మ్మ­క్కు అయిం­ద­న్న వా­ర్త­ల­పై తీ­వ్రం­గా స్పం­దిం­చా­రు. తమకు అలాం­టి అవ­స­రం లే­ద­ని ఆరో­పిం­చా­రు. కవిత రా­జీ­నా­మా బీ­ఆ­ర్ఎ­స్ అం­త­ర్గత వ్య­వ­హా­ర­మ­న్న మహే­ష్ కు­మా­ర్ గౌడ్... బీ­ఆ­ర్ఎ­స్ క్ర­మం­గా ఉని­కి కో­ల్పో­తోం­ద­న్నా­రు. కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్ట్ అవి­నీ­తి­లో మామ కే­సీ­ఆ­ర్‌ వాటా ఎంత..? అల్లు­డు హరీ­శ్‌ రావు వాటా ఎంత..? అనే­ది తే­లా­ల్సి ఉం­ద­న్నా­రు.

బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదు: రఘునందన్‌రావు

తె­లం­గాణ జా­గృ­తి అధ్య­క్షు­రా­లు కల్వ­కుం­ట్ల కవి­తన బీ­జే­పీ­లో చే­రు­తా­రం­టూ ఊహా­గా­నా­లు చె­ల­రే­గా­యి. దీ­ని­పై బీ­జే­పీ కీలక నేత, ఎంపీ రఘు­నం­ద­న్ రావు స్పం­దిం­చా­రు. కవి­త­ను బీ­జే­పీ­లో చే­ర్చు­కు­నే ప్ర­స­క్తే­లే­ద­ని స్ప­ష్టం చే­శా­రు. హరీ­ష్‌ రావు - సీఎం రే­వం­త్ రె­డ్డి ఒకే ఫ్లై­ట్‌­లో వచ్చా­ర­నే­ది నిజం అని అన్నా­రు. ఫ్లై­ట్‌­లో వా­ళ్లు తనను ఓడిం­చ­డం వి­ష­యం గు­రిం­చే మా­ట్లా­డు­కు­న్నా­ర­ని చె­ప్పా­రు. కవిత రా­జ­కీ­యా­ల­కు దూ­రం­గా ఉంటే వ్య­క్తి కాదు.. తప్ప­కుం­డా కొ­త్త పా­ర్టీ పె­ట్టే అవ­కా­శం ఉం­ద­ని రఘు­నం­ద­న్ రావు కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. దాం­తో పాటు కవిత కొ­త్త­గా ఏమీ చె­ప్ప­లే­ద­ని చాలా కా­లం­గా తాము చె­బు­తు­న్న వి­ష­యా­ల­నే ఇప్పు­డు ఆమె చె­ప్పా­ర­ని జడ్పీ అధ్య­క్షు­డి­గా తనను ఎవరు ఓడిం­చా­రో గతం­లో కే­సీ­ఆ­ర్‌­కు చె­ప్పా­న­ని అయి­నా ఆ రోజు కే­సీ­ఆ­ర్ ఎలాం­టి చర్య­లు తీ­సు­కో­లే­ద­న్నా­రు. బీ­ఆ­ర్ఎ­స్ ఎమ్మె­ల్సీల అవి­నీ­తి­ని పా­ర్టీ నుం­చి సస్పెం­డ్ కా­క­ముం­దు మా­ట్లా­డి ఉంటే బా­గుం­డే­ద­ని రఘు­నం­ద­న్ రావు అన్నా­రు.

Tags

Next Story