MALLAREDDY: మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల విషయంలో భారీగా విద్యార్థుల నుంచి డొనేషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మేనేజ్మెంట్ కోటాలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కన్నా విద్యార్థుల నుంచి భారీగా డబ్బు లాగుతున్నారనే ఫిర్యాదులు పెద్ద ఎత్తున అందాయి. మంత్రి మల్లారెడ్డి ప్రభుత్వానికి చెల్లిస్తున్న ఆదాయ పన్నులో హెచ్చుతగ్గులను గుర్తించిన ఐటీ అధికారులు... కోడలు ప్రీతి రెడ్డితో పాటు కొడుకు భద్రారెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహించారు.
ఈ ఐటీ రైడ్ లో ఐటి బృందం సిబ్బంది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, వారిని ఇంట్లోనే ఉండాలని సూచించినట్లు సమాచారం. గతంలో కూడా ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మల్లారెడ్డి కుటుంబానికి సంబంధించిన ఆస్తులపై దాడులు నిర్వహించి లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా, రెండు రోజుల క్రితం భద్రారెడ్డి భార్య ప్రీతి రెడ్డి హైదరాబాద్లో బీజేపీ నాయకులను కలిశారు. బోనాలు ఉత్సవాల సందర్భంగా ఆమె సహచరులు బీజేపీ నాయకులను చిత్రీకరించిన బ్యానర్ లను కూడా ఏర్పాటు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com